ఫైనల్లో రుత్విక | ruthvika shivani reached in finals | Sakshi
Sakshi News home page

ఫైనల్లో రుత్విక

Published Wed, Dec 24 2014 1:35 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఫైనల్లో రుత్విక - Sakshi

ఫైనల్లో రుత్విక

జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్
 పాట్నా: జాతీయ జూని యర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ అండర్-19 బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన రుత్విక శివాని ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో రుత్విక 21-16, 21-13తో సహచర ప్లేయర్ వృశాలిపై నెగ్గింది. ఫైనల్లో హైదరాబాద్‌కే చెందిన రితూపర్ణ దాస్‌తో రుత్విక ఆడుతుంది.
 
 మరో సెమీఫైనల్లో రితూపర్ణ దాస్ 21-9, 21-10తో శ్రీకృష్ణ ప్రియను ఓడించింది. అండర్-19 సెమీస్‌లో ఓడి నప్పటికీ వృశాలి అండర్-17 విభాగంలో ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో వృశాలి 21-15, 21-18తో శిఖా గౌతమ్ (కర్ణాటక)పై నెగ్గింది. ఫైనల్లో శ్రేయాన్షి పరదేశి (ఎయిరిండియా)తో ఆమె తలపడుతుంది. అండర్-17 బాలుర సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో సిరిల్ వర్మ 21-10, 21-14తో సహచరుడు కనిష్క్‌ను ఓడించాడు. అండర్-17 బాలుర డబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణప్రసాద్-సాత్విక్ సాయిరాజ్ జోడి ఫైనల్లోకి అడుగుపెట్టింది. సెమీఫైనల్లో కృష్ణప్రసాద్-సాత్విక్ సాయిరాజ్ ద్వయం 23-21, 14-21, 21-17తో కార్తీక్ జిందాల్-హర్‌దీప్ మక్కర్ (హరియాణా) జోడీపై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement