టీమిండియాకు భారీ ఆధిక్యం | team india gets 190 runs and lose 4 wickets, over all leading 403 runs against south africa | Sakshi
Sakshi News home page

టీమిండియాకు భారీ ఆధిక్యం

Published Sat, Dec 5 2015 4:48 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

టీమిండియాకు భారీ ఆధిక్యం

టీమిండియాకు భారీ ఆధిక్యం

నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం సాధించింది.

ఢిల్లీ:నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం సాధించింది. శనివారం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా 81.0 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. దీంతో విరాట్ సేన మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఓవరాల్ గా 403 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది.


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి (83 బ్యాటింగ్) అజింక్యా రహానే(52 బ్యాటింగ్)లు మరోసారి రాణించడంతో టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది.  టీమిండియా  57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి తడబడిన సమయంలో విరాట్-రహానే జోడి ఆదుకుంది.  ఈ జోడి అజేయంగా 133 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాను పటిష్టస్థితికి చేర్చారు. ఈ రోజు ఆట ఆదిలో టీమిండియా ఎనిమిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మురళీ విజయ్(3), రోహిత్ శర్మ(0) లు పెవిలియన్ కు చేరి నిరాశపరిచారు.  ఆ తరువాత శిఖర్-పూజారాల జోడి మరమ్మత్తులు చేపట్టింది. కాగా, 45 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన ఈ జోడి లంచ్ తరువాత నాలుగు పరుగుల వ్యవధిలో నిష్క్రమించడంతో టీమిండియా జట్టులో కలవరం మొదలైంది.

 

అయితే అటు తరువాత విరాట్ , రహానేలు దాటిగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించడంతో తిరిగి టీమిండియా గాడిలో పడింది. ఈ క్రమంలోనే విరాట్, రహానేలు అజేయ హాఫ్ సెంచరీలు సాధించి సఫారీలకు పరీక్షగా నిలిచారు. ఇప్పటికే విరాట్ సేన భారీ ఆధిక్యంలో నిలవడంతో పాటు, ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో సఫారీలకు మరోసారి సవాల్ గా మారనుంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్నీ మోర్కెల్ మూడు వికెట్లు తీయగా, ఇమ్రాన్ తాహీర్ కు ఒక వికెట్ దక్కింది.  తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 334 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 121 పరుగులకు ఆలౌటయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement