జర్మనీ టెన్నిస్ దిగ్గజం స్టెఫీగ్రాఫ్ తండ్రి పీటర్ గ్రాఫ్ కేన్సర్ వ్యాధితో మరణించారు. మాన్హీమ్లో ఆదివారం రాత్రి పీటర్ (73) చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. స్టెఫీగ్రాఫ్ అత్యున్నత దశకు చేరుకోవడానికి పీటర్ ఎంతో కృషి చేశారు. స్టీఫ్ కెరీర్ కొనసాగించిన సమయంలో ఆమె వెన్నంటే ఉంటూ ప్రోత్సహించారు. కూతురుకు పీటర్ కోచ్గా, మేనేజర్గా వ్యవహరించారు.
1997లో పన్ను ఎగువేత కేసులో పీటర్కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఆ సమయంలో తండ్రికూతుళ్ల మధ్య అంతరం ఏర్పడింది. అనంతరం ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఏడాది శిక్ష అనుభవించిన పీటర్ ఇటీవల కాలంలో విదేశీ టెన్నిస్ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చాడు. తన కెరీర్లో రికార్డు స్థాయిలో 22 గాండ్ర్స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న స్టెఫీగ్రాఫ్ టెన్నిస్ స్టార్ ఆండ్రీ అగస్సీని పెళ్లి చేసుకుంది.
స్టెఫీగ్రాఫ్ తండ్రి పీటర్ మృతి
Published Mon, Dec 2 2013 9:26 AM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM
Advertisement
Advertisement