ఈ సాయంత్రమే సైనా- సింధుల పోరు | Today evening Saina-Sindhu match | Sakshi
Sakshi News home page

ఈ సాయంత్రమే సైనా- సింధుల పోరు

Published Thu, Aug 15 2013 2:44 PM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM

ఈ సాయంత్రమే సైనా- సింధుల పోరు

ఈ సాయంత్రమే సైనా- సింధుల పోరు

హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్‌, పి.వి. సింధు ఇద్దరూ ఈరోజు పోటీపడనున్నారు.

న్యూఢిల్లీ: హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్‌, పి.వి. సింధు ఇద్దరూ ఈరోజు పోటీపడనున్నారు.  గోపీచంద్ అకాడమీలో కలిసి ప్రాక్టీస్ చేసిన ఈ ఇద్దరూ తొలిసారిగా ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్(ఐబీఎల్‌)లో ముఖాముఖి తలపడనున్నారు. మహిళల సింగిల్స్ ఏకైక మ్యాచ్‌లో హైదరాబాద్ హాట్‌షాట్స్ తరపున సైనా నెహ్వాల్,  అవధ్ వారియర్స్ తరపున సింధు బరిలోకి దిగనున్నారు.

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకొని సింధు మంచి జోరు మీద ఉంది. వరుసగా నాలుగోసారీ ప్రపంచ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లో ఓడిన సైనా ఒత్తిడిలో ఉంది. ఈ ఇద్దరి స్టార్స్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితానికి అధికారిక గుర్తింపు లేకపోయినా, టోర్నీకి హైలైట్ అయ్యే అవకాశం ఉంది.

 భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్‌తో పోరుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం సాధించిన తరువాత సింధు చెప్పింది. సైనాతో తలపడటానికి సింధు ఆసక్తి కనబరుస్తోంది. అంతే కాకుండా  తమ మధ్య జరిగే మ్యాచ్‌లో సైనాను నిలువరించటానికి ప్రయత్నిస్తానని కూడా సింధు సవాల్ విసిరింది. ఈ పరిస్థితులలో వీరిద్దరి మధ్య పోరు రసవత్తరంగా సాగడం ఖాయం.

వీరిద్దరి పోరు   సాయంత్రం  4.00 గంటలకు ప్రారంభమవుతుంది.  ఈ మ్యాచ్  ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement