
విరాట్ కోహ్లి సరికొత్త రికార్డు
ముంబై: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి సరికొత్త రికార్డు నమోదు చేశాడు. వరల్డ్ టీ 20లో భాగంగా గురువారం ఇక్కడ విండీస్ తో సెమీ ఫైనల్ మ్యాచ్లో విరాట్ (89 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించి.. ట్వంటీ 20ల్లో పదహారవ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ 20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకూ ఇన్ని అర్థశతకాలు ఏ బ్యాట్మెన్ చేయలేదు. అంతకుముందు ఈ రికార్డు క్రిస్ గేల్, బ్రెండన్ మెక కల్లమ్ పేరిట ఉండేది. వీరిద్దరూ టీ 20ల్లో 15 హాఫ్ సెంచరీలు సాధించారు.