వరల్డ్ టీ 20 కెప్టెన్గా కోహ్లి | virat Kohli named captain of World T20 XI | Sakshi
Sakshi News home page

వరల్డ్ టీ 20 కెప్టెన్గా కోహ్లి

Published Mon, Apr 4 2016 4:47 PM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM

వరల్డ్ టీ 20 కెప్టెన్గా కోహ్లి

వరల్డ్ టీ 20 కెప్టెన్గా కోహ్లి

కోల్కతా: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వరల్డ్ టీ 20  కెప్టెన్ గా భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఎంపికయ్యాడు. వరల్డ్ టీ 20లో ప్రతిభ ఆధారంగా మాజీ క్రికెటర్లు, వ్యాఖ్యాతలతో కూడిన సెలెక్షన్ కమిటీ విరాట్ కోహ్లిని సారథిగా ఎంపిక చేసింది. ఈ మేరకు 12 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఐసీసీ సోమవారం వెల్లడించింది. భారత జట్టు నుంచి విరాట్ తో పాటు, వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రాకు కూడా చోటు దక్కింది.

ఈ టోర్నీలో విరాట్ కోహ్లి మూడు హాఫ్ సెంచరీల సాయంతో 273 పరుగులు నమోదు చేశాడు. వరల్డ్ ట్వంటీ 20లో విరాట్ యావరేజ్ 136.50 ఉండగా, స్ట్రైక్ రేట్ 146. 77 గా ఉంది. విరాట్ సాధించిన పరుగుల్లో 29 బౌండరీలు, 5 సిక్సర్లు ఉండటం విశేషం. అయితే ఈ టోర్నీలో విరాట్ రెండో అత్యుత్తమ ఆటగాడిగా నిలవగా, బంగ్లాదేశ్కు చెందిన తమీమ్ ఇక్బాల్(295) తొలిస్థానాన్ని సాధించాడు.


వరల్డ్ టీ 20 పురుషుల జట్టు ఇదే..
విరాట్ కోహ్లి(భారత్, కెప్టెన్), జాసన్ రాయ్(ఇంగ్లండ్), డీకాక్(దక్షిణాఫ్రికా), జో రూట్(ఇంగ్లండ్), బట్లర్(ఇంగ్లండ్), షేన్ వాట్సన్(ఆస్ట్రేలియా), ఆండ్రీ రస్సెల్(వెస్టిండీస్), మిచెల్ సాంట్నార్(న్యూజిలాండ్), డేవిడ్ విల్లే(ఇంగ్లండ్), శామ్యూల్ బద్రి(వెస్టిండీస్), ఆశిష్ నెహ్రా(భారత్), ముస్తాఫిజుర్ రెహ్మాన్(బంగ్లాదేశ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement