విరుష్క హనీమూన్‌ ఫోటో హల్‌చల్‌ | Virat Kohli in holiday mode before South Africa tour, wife Anushka Sharma shares honeymoon picture | Sakshi
Sakshi News home page

విరుష్క హనీమూన్‌ ఫోటో హల్‌చల్‌

Published Fri, Dec 15 2017 3:09 PM | Last Updated on Fri, Dec 15 2017 4:06 PM

Virat Kohli in holiday mode before South Africa tour, wife Anushka Sharma shares honeymoon picture - Sakshi

అతి రహస్యంగా ఇటలీలో ఇటీవల పెళ్లిచేసుకున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ హనీమూన్‌లో బిజీబిజీగా ఉన్నారు. తమ హనీమూన్‌ ఫోటోను అనుష్క, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఫోటో షేర్‌చేసిన గంటల్లోనే ఏడున్నర లక్షలకు పైగా లైక్స్‌ను సొంతం చేసుకుంది. కామెంట్ల వెల్లువ కురుస్తోంది. సౌత్‌ఆఫ్రికాలోని ఒక చిన్నదీవిలో వీరు హనీమూన్‌ను ఎంజాయ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అనుష్క షేర్‌ చేసిన ఈ ఫోటో హల్‌చల్‌ చేస్తోంది.

కాగా, హనీమూన్‌ అనంతరం డిసెంబర్‌ నెల 21న ఢిల్లీలో తాజ్‌ డిప్లొమాటిక్‌ ఎంక్లేవ్‌లో బంధువులకు, 26న ముంబైలో క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీలకు  గ్రాండ్‌ రిసెప్షన్‌ ప్లాన్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆహ్వానితులకు ఇన్విటేషన్లు కూడా అందాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement