honeymoon photos
-
విరుష్క హనీమూన్ ఫోటో హల్చల్
అతి రహస్యంగా ఇటలీలో ఇటీవల పెళ్లిచేసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ హనీమూన్‌లో బిజీబిజీగా ఉన్నారు. తమ హనీమూన్ ఫోటోను అనుష్క, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఫోటో షేర్చేసిన గంటల్లోనే ఏడున్నర లక్షలకు పైగా లైక్స్‌ను సొంతం చేసుకుంది. కామెంట్ల వెల్లువ కురుస్తోంది. సౌత్‌ఆఫ్రికాలోని ఒక చిన్నదీవిలో వీరు హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అనుష్క షేర్ చేసిన ఈ ఫోటో హల్చల్ చేస్తోంది. కాగా, హనీమూన్ అనంతరం డిసెంబర్ నెల 21న ఢిల్లీలో తాజ్ డిప్లొమాటిక్ ఎంక్లేవ్‌లో బంధువులకు, 26న ముంబైలో క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీలకు గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆహ్వానితులకు ఇన్విటేషన్లు కూడా అందాయి. -
హనీమూన్ ఫోటోలను తొలగించండి!
లండన్:వివాహ వ్యవస్థకు సంబంధించిన హనీమూన్ ఫోటోలను ఫేస్ బుక్ నుంచి వెంటనే తొలగించాలని ఓ భార్యకు ఇటాలియన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన అనుమతి లేకుండా ఫేస్ బుక్ లో భార్య పోస్ట్ చేసిన ఫోటోలను తొలగించాలంటూ భర్త కోర్టును ఆశ్రయించాడు. దీంతో విచారణకు స్వీకరించిన కోర్టు ఆ ఫోటోలను వెంటనే తీసివేయాలంటూ ఆమెకు సూచించింది. ఆ ఫోటోలను నిశితంగా పరిశీలించిన కోర్టు.. ఆమె ఆర్టికల్ 10 సెక్షన్ తో పాటు భర్త యొక్క ప్రాధమిక హక్కులను ఉల్లంఘించారని స్పష్టం చేసింది. దీనిపై వాదించిన భార్య తరపు న్యాయవాది.. అతివేగంతో దూసుకుపోతున్ననేటి సోషల్ మీడియాలో ప్రైవేటు ఆల్బమ్ లను పోస్ట్ చేయడానికి ఫేస్ బుక్ ఒక వారధి లాంటిదని వాదించాడు. కాగా, ఈ వాదనతో ఏకీభవించని కోర్టు ఆ ఫోటోలను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును భర్త తరపు న్యాయవాది స్వాగతించాడు. ఈ రకంగా ఆమె భర్తకు కల్గించిన నష్టానికి భార్య తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపాడు. ఫేస్ బుక్ లో ఇష్టానుసారం పోస్ట్ చేసే వారికి ఇదొక హెచ్చరికలాంటిదని అభిప్రాయపడ్డాడు. -
హనీమూన్ ఫొటోలపై రభస
‘‘అబ్బా.. మాల్దీవులు ఎంత అందంగా ఉన్నాయో.. స్వర్గం అంటే ఇలానే ఉంటుందేమో’’ అని మురిసిపోయారు అమలాపాల్. ఇటీవల తమిళ దర్శకుడు విజయ్‌తో అమలాపాల్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత హనీమూన్‌ని ఎంజాయ్ చేయడానికి మాల్దీవులు వెళ్లింది ఈ జంట. హనీమూన్ తీపి గుర్తుగా అక్కడ ఫొటోలు కూడా దిగారు. ఆ ఫొటోలను ఆల్బమ్‌లో మాత్రమే దాచుకుని ఉంటే బాగుండేదేమో. తన ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలనుకున్నారో ఏమో కొన్ని ఫొటోలను ఫేస్బుక్లో పెట్టారు అమలాపాల్. అవి చూసి, కొంతమంది ‘సూపర్బ్’ అనీ, ‘మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాం’ అని కామెంట్ చేశారు. కానీ, కొంతమంది మాత్రం ఇష్టం వచ్చినట్లుగా రెచ్చిపోయారు. ‘హనీమూన్ ఎంజాయ్ చేయడానికి ఇండియాలో అందమైన లొకేషన్లు దొరక లేదా? మాల్దీవుల వరకూ వెళ్లారు..’ అని ఒకరు కామెంట్ చేస్తే, ‘హనీమూన్‌కి వచ్చే అవకాశం నాకూ కల్పించవా’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇంకా అభ్యంతరకర వ్యాఖ్యలు చాలానే వచ్చాయి. ఇలా జరుగుతుందని ఊహించని అమలాపాల్ ఖంగుతిని ఉంటారు. అందుకే, హడావిడిగా ఆ ఫొటోలన్నింటినీ ఫేస్బుక్లో నుంచి తీసేశారు. ఫేస్బుక్, ట్విట్టర్.. ఇవన్నీ దేశ, విదేశాల్లో ఉన్నవారితో టచ్‌లో ఉండటానికి ఉపయోగపడతాయి. కానీ, ఆరోగ్యకరమైన రీతిలో వాడుకున్నంతవరకూ ఫరవాలేదు. ఒకరి మనసు గాయపడే విధమైన వ్యాఖ్యలు చేయడం మాత్రం సంస్కారం అనిపించుకోదని చెప్పొచ్చు. పాపం.. హనీమూన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లిన అమలాపాల్ దంపతుల్ని ఈ సంఘటన బాధపెట్టే ఉంటుంది.