హనీమూన్ ఫొటోలపై రభస | Amala Paul's honeymoon photos stir argument | Sakshi
Sakshi News home page

హనీమూన్ ఫొటోలపై రభస

Published Sat, Jun 21 2014 10:56 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

హనీమూన్ ఫొటోలపై రభస - Sakshi

హనీమూన్ ఫొటోలపై రభస

 ‘‘అబ్బా.. మాల్దీవులు ఎంత అందంగా ఉన్నాయో.. స్వర్గం అంటే ఇలానే ఉంటుందేమో’’ అని మురిసిపోయారు అమలాపాల్. ఇటీవల తమిళ దర్శకుడు విజయ్‌తో అమలాపాల్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత హనీమూన్‌ని ఎంజాయ్ చేయడానికి మాల్దీవులు వెళ్లింది ఈ జంట. హనీమూన్ తీపి గుర్తుగా అక్కడ ఫొటోలు కూడా దిగారు. ఆ ఫొటోలను ఆల్బమ్‌లో మాత్రమే దాచుకుని ఉంటే బాగుండేదేమో.
 
 తన ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలనుకున్నారో ఏమో కొన్ని ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టారు అమలాపాల్. అవి చూసి, కొంతమంది ‘సూపర్బ్’ అనీ, ‘మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాం’ అని కామెంట్ చేశారు. కానీ, కొంతమంది మాత్రం ఇష్టం వచ్చినట్లుగా రెచ్చిపోయారు. ‘హనీమూన్ ఎంజాయ్ చేయడానికి ఇండియాలో అందమైన లొకేషన్లు దొరక లేదా? మాల్దీవుల వరకూ వెళ్లారు..’ అని ఒకరు కామెంట్ చేస్తే, ‘హనీమూన్‌కి వచ్చే అవకాశం నాకూ కల్పించవా’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇంకా అభ్యంతరకర వ్యాఖ్యలు చాలానే వచ్చాయి.
 
 ఇలా జరుగుతుందని ఊహించని అమలాపాల్ ఖంగుతిని ఉంటారు. అందుకే, హడావిడిగా ఆ ఫొటోలన్నింటినీ ఫేస్‌బుక్‌లో నుంచి తీసేశారు. ఫేస్‌బుక్, ట్విట్టర్.. ఇవన్నీ దేశ, విదేశాల్లో ఉన్నవారితో టచ్‌లో ఉండటానికి ఉపయోగపడతాయి. కానీ, ఆరోగ్యకరమైన రీతిలో వాడుకున్నంతవరకూ ఫరవాలేదు. ఒకరి మనసు గాయపడే విధమైన వ్యాఖ్యలు చేయడం మాత్రం సంస్కారం అనిపించుకోదని చెప్పొచ్చు. పాపం.. హనీమూన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లిన అమలాపాల్ దంపతుల్ని ఈ సంఘటన బాధపెట్టే ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement