కోల్కతా: వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా ఇక్కడ ఆదివారం ఈడెన్ గార్డెన్లో ఇంగ్లండ్తో జరుగుతున్న టైటిల్ పోరులో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 2010లో ఇంగ్లండ్, 2012లో వెస్టిండీస్ ఒక్కోసారి వరల్డ్ టీ 20 టైటిల్ గెలిచాయి. ఇక్కడ విజయం సాధించే జట్టు రెండోసారి టైటిల్ గెలిచిన మొదటి జట్టుగా ఘనత సాధిస్తుంది. ఇరు జట్ల మధ్య 13 టి20 మ్యాచ్‌లు జరిగితే వెస్టిండీస్ 9 గెలిచి 4 ఓడింది. వరల్డ్ కప్‌లోనైతే 4 సార్లూ విండీస్‌దే విజయం. అయితే రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. మరోవైపు ఈ ప్రపంచకప్లో విండీస్ ఆరుసార్లూ టాస్ గెలవడం విశేషం.
ఇంగ్లండ్ జట్టులో ప్రధానంగా జేసన్ రాయ్, బట్లర్, హేల్స్ ధాటిగా ఆడుతుండగా, జో రూట్ అద్భుతమైన ఫామ్‌తో నిలకడ చూపిస్తున్నాడు. వెస్టిండీస్ తరఫున క్రిస్ గేల్, సిమన్స్, రసెల్, చార్లెస్ లు కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో అంతిమ సమరం రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
Published Sun, Apr 3 2016 6:48 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM
Advertisement