ఇన్నాళ్లూ గోపీచంద్ అకాడమీలో కలిసి ప్రాక్టీస్ చేసిన సైనా నెహ్వాల్, పి.వి.సింధు తొలిసారి ముఖాముఖిగా పోరాడనున్నారు. ఐబీఎల్‌లో గురువారం ఈ దృశ్యం కనిపించనుంది.
ఇన్నాళ్లూ గోపీచంద్ అకాడమీలో కలిసి ప్రాక్టీస్ చేసిన సైనా నెహ్వాల్, పి.వి.సింధు తొలిసారి ముఖాముఖిగా పోరాడనున్నారు. ఐబీఎల్‌లో గురువారం ఈ దృశ్యం కనిపించనుంది. మహిళల సింగిల్స్ ఏకైక మ్యాచ్‌లో హైదరాబాద్ హాట్‌షాట్స్ తరఫున సైనా... అవధ్ వారియర్స్ నుంచి సింధు బరిలోకి దిగనున్నారు.
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి సింధు జోరు మీద ఉండగా... వరుసగా నాలుగోసారీ ప్రపంచ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లో ఓడిన సైనా ఒత్తిడిలో ఉంది. ఈ ఇద్దరి స్టార్స్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితానికి అధికారిక గుర్తింపు లేకపోయినా...టోర్నీకి హైలైట్ కావచ్చు.
ఐబీఎల్‌లో నేడు
హైదరాబాద్ హాట్‌షాట్స్
x
అవధ్ వారియర్స్
సాయంత్రం గం. 4.00 నుంచి
ముంబై మాస్టర్స్
x
బంగా బీట్స్
రాత్రి గం. 8.00 నుంచి
ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం