'టీమిండియా.. మేమంతా మీ వెనుకే ఉన్నాం' | World T20 Semis: Heart With India But West Indies Playing Well, Says Sachin Tendulkar | Sakshi
Sakshi News home page

'టీమిండియా.. మేమంతా మీ వెనుకే ఉన్నాం'

Published Thu, Mar 31 2016 3:05 PM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM

'టీమిండియా.. మేమంతా మీ వెనుకే ఉన్నాం'

'టీమిండియా.. మేమంతా మీ వెనుకే ఉన్నాం'

ముంబై: మరికొన్ని గంటల్లో టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే టి-20 ప్రపంచ కప్ సెమీస్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఎంతో ఉత్సుకతో ఉన్నాడు. కాగా ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న విషయాన్ని మాస్టర్ వెల్లడించలేదు. 'ఇది ఓపెన్ గేమ్' అని వ్యాఖ్యానించాడు. 'క్రికెట్ను ఆస్వాదించండి. ఆటపైనే దృష్టిపెట్టండి. ఫలితం వస్తుంది. మేమంతా మీ వెనుకే ఉన్నాం' అని టీమిండియాకు సచిన్ శుభాకాంక్షలు తెలిపాడు.

'నా మనసు ఎప్పుడూ భారతే అనే చెబుతోంది. మరొకటి ఉండదు. అయితే ఈ రోజు జరిగే సెమీస్ ఓపెన్ గేమ్. హోరాహోరీ పోరాటం ఉండవచ్చు. ఎందుకంటే వెస్టిండీస్ అత్యుత్తమ క్రికెట్ ఆడుతోంది. ఆ జట్టులో కొందరు మేటి ఆటగాళ్లున్నారు. మనోళ్లు కూడా అద్భుతంగా ఆడుతున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో గత మ్యాచ్, పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా సత్తాచాటింది. భారత్ ఇదే జోరు కొనసాగిస్తుందని ఆశిస్తున్నా' అని సచిన్ అన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement