పిల్లాడే కదా అని అనుకుంటే అది చివరికి అమాయకత్వమే అవుతోంది. నగరంలో బాలనేరస్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. నేషనల్ క్రైంరికార్డ్స్ బ్యూరో గణాంకాలు దీన్నే సూచిస్తున్నాయి.
న్యూఢిల్లీ: నగరంలో బాలనేరస్తులు మహిళలు లైంగికవేధింపులకు పాల్పడుతున్న ఘటనల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.ఇక అత్యాచారాల సంఖ్య 60.3 శాతం మేర పెరిగింది. నేషనల్ క్రైంరికార్డ్స్ బ్యూరో అందించిన వివరాల ప్రకారం 2013లో బాల నేరస్తులు మహిళలపై లైంగిక దాడులు 132.3 శాతం మేర పెరిగింది. మహిళలపట్ల అసభ్యంగా వ్యవహరించిన కేసుల సంఖ్య 60.3 శాతంగాను నమోదయ్యింది. 16 నుంచి 18 సంవత్సరాల వయ స్సు గల 66.3 శాతం మంది బాలనేరస్తులను పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు.
గత ఏడాది బాల నేరస్తులు పాల్పడిన నేరాల సంఖ్య 31,725గా నమోదయ్యింది. అంతకుముందు 2012లో 27,936 మంది బాలనేరస్తులపై కేసులు నమోదయ్యాయి. ఇక 7,969 మందిపై దొంగతనం, 6,043 మందిపై దాడిచేసి గాయపరిచిన కేసులు, మరో 3,784మందిపై చోరీ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాలనేరస్తుల సంఖ్య 43,506 కాగా వారిలో 8,392 మంది నిరక్షరాస్యులు కాగా 13,984 మంది అక్షరాస్యులు. బాలనేరస్తుల్లో అత్యధిక శాతంమంది నిరుపేద కుటుంబాలకు చెందినవారే. ఆయా కుటుంబాల వార్షిక ఆదాయం రూ. 25 వేలకు లోపే కావడం ఈ సందర్భంగా గమనార్హం. వీరిలో 35 వేలమందికిపైగా తమ తల్లిదండ్రులతోనే నివసిస్తున్నారు.
ఇతర నిందితులతో సమానంగా చూడాలి
కాగా అత్యాచారం కేసుల్లోనమోదైన బాలనేరస్తులను ఇతర నేరాలకు పాల్పడిన వారితో సమానంగానే పరిగణించాలనేది కేంద్ర మహిళ, కుటుంబసంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ వాదన. లైంగిక నేరాల్లో పాల్గొంటున్నవారిలో 16 ఏళ్ల లోపు వారు కూడా ఉంటున్నారని అన్నారు. బాలనేరస్తుల చట్టం పై వారికి అవగాహన ఉందని వాదిస్తున్నారు. అం దువల్లనే వారు ఆవిధంగా చేయగలుగుతున్నారన్నా రు. ఇటువంటి వారిని ఇతర కేసుల్లో నిందితులతో సమానంగా పరిగణిస్తే వారిలో భయమేర్పడుతుం దన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మహిళ, కుటుంబసంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన కృష్ణతీరథ్... అత్యాచారం కేసుల్లోనమోదైన బాలనేరస్తులను ఇతర నేరాలకు పాల్పడిన వారితో సమానంగానే పరిగణించాలంటూ ఓ ప్రతి పాదన కూడా చేశారు. అయితే ఈ ప్రతిపాదనను అప్పట్లో బాలల హక్కుల సంఘాలు వ్యతిరేకించా యి. అయితే నేరాలకు పాల్పడే బాలలపై చర్యలకు ఉపక్రమించేందుకు వీలుగా ఆగస్టు 12వ తేదీన కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టింది.
అమాయకులు కాదు... కామపిశాచులు
Published Mon, Aug 18 2014 10:19 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement