న్యూఢిల్లీ: ప్రత్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలను అడ్డుకొనేందుకు ఆప్ నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రత్యర్థులు మద్యం, నగదు పంపిణి చేయకుండా నిరోధించేందుకు వాలంటీర్లను రంగంలోకి దించింది. ప్రధానంగా మురికి వాడలు, పునరావాస కాలనీల్లో ‘ఓట్ కీ చౌకీదారీ’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. నిఘా కెమెరాలు, మొబైల్ ఫోన్లతో ఉండే వాలంటీర్లు ఎలాంటి ప్రలోభ చర్యలు కనిపించిన నేరుగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారని ఆప్ నాయకుడొకరు తెలిపారు.