పళ్లిపట్టు: అధికార అన్నాడీఎంకే నేత దారుణహత్యకు గురైన సంఘటన తిరుత్తణిలో కలకలం రేపింది. తమ పార్టీ నేత దారుణహత్యకు నిరసనగా అన్నాడీఎంకే శ్రేణులు దుకాణాలు మూయించే ప్రయత్నం చేశారు. దీన్ని పోలీసులు అడ్డుకునే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణికి చెందిన ఆరుముగం(42) అలియాస్ ఆపిల్ ఆరుముగం అన్నాడీఎంకే పార్టీ జిల్లా యువజన విభాగ ఉప కార్యదర్శిగాను, తిరుత్తణి నగర పాలక సంస్థ సభ్యుడిగా ఉన్నారు.పోలీసు స్టేషన్లో ఇతనిపై దాదాపు 12 కేసులున్నాయి.
ఇదిలా ఉండగా వారం రోజుల క్రి తం స్థానిక బస్టాండు ప్రాం తంలో ఇతను వాకింగ్ వెళుతున్న సమయంలో హత్యాయత్నం జరిగింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తిరుత్తణి ఇంద్రానగర్‌లో ఉన్న వాటర్‌ప్లాంట్‌కు ఆరుముగం బయలుదేరారు. ఆ సమయంలో ఆటోలో వెంబడించిన దుండగు లు ఇతనిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. అయి తే వారి నుంచి తప్పించుకుని పారిపోతున్న సమయం లో వెనకాలే వచ్చిన దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆరుముగంను అటువైపుగా వచ్చిన కొంతమంది వ్యక్తులు తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలించిన కొంతసేపటికే ఆరుముగం మృతి చె ందాడు.
రాస్తారోకో రణరంగం
తమ నేత హత్య గురయ్యాడన్న విషయంతో ఆగ్రహం చెందిన అన్నాడీఎంకే శ్రేణులు నిరసనగా దుకాణాలను మూసి వేయించేందుకు ప్రయత్నించారు. సమాచారంతో అక్కడికి చేరుకున్న డీఎస్పీ ఈశవరన్ నేతృత్వంలోని పోలీసులు వీరిని అడ్డుకున్నారు. పోలీసులు తీరుకు నిరసనగా ఎంపీ హరి ఆధ్వర్యంలో దాదాపు 300 మంది చెన్నై బైపాస్ రోడ్డులో రాస్తారోకో చేపట్టారు. దీనికి కూడా పోలీసులు అడ్డు చెప్పడంతో అన్నాడీఎంకే శ్రేణులు ఎదురు తిరిగారు. జిల్లా ఎస్పీ శ్యాంసన్ సంఘటన ప్రాంతం చేరుకుని ఎంపీ, అన్నాడీఎంకే కార్యకర్తలకు సర్దిచెప్పారు. అయితే రాస్తారోకో విరమించి వెళుతున్న సమయంలో మళ్లీ డీఎస్పీ ఈశ్వరన్ వాహనాన్ని చుట్టుముట్టి దాడి చేయడంతో రాస్తారోకో రణరంగంగా మారింది. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేశారు.
విలేకర్లకు తీవ్ర గాయాలు
పోలీసులు లాఠీ చార్జి సమయంలో అక్కడే ఉన్న మాలై తమిళగం తమిళ పత్రిక విలేకరి కృష్ణనన్‌కు తీవ్ర గా యాలయ్యాయి. ఆంధ్రజ్యోతి, మాలైమురసు విలేకర్లు హరికుమార్‌శర్మ, వినోత్ తదితరులు గాయపడ్డారు. వీరిని వెంటనే తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. ఇదిలా ఉండగా 500 మంది పోలీసులు తిరుత్తణిలో మోహరించి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
హంతకుల కోసం గాలిస్తున్నాం: ఎస్పీ శ్యాంసన్
అన్నాడీఎంకే నేత దారుణహత్యకు సంబంధించి ఎస్పీ శ్యాంసన్ మాట్లాడుతూ హంతకుల కోసం ప్రత్యేక బృందాన్ని బరిలోకి దింపామని దుండగులను తొందర్లోనే తెలిపారు.
అన్నాడీఎంకే నేత దారుణ హత్య
Published Mon, Oct 10 2016 1:44 AM | Last Updated on Thu, May 24 2018 12:05 PM
Advertisement