the brutal murder
-
అన్నాడీఎంకే నేత దారుణ హత్య
పళ్లిపట్టు: అధికార అన్నాడీఎంకే నేత దారుణహత్యకు గురైన సంఘటన తిరుత్తణిలో కలకలం రేపింది. తమ పార్టీ నేత దారుణహత్యకు నిరసనగా అన్నాడీఎంకే శ్రేణులు దుకాణాలు మూయించే ప్రయత్నం చేశారు. దీన్ని పోలీసులు అడ్డుకునే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణికి చెందిన ఆరుముగం(42) అలియాస్ ఆపిల్ ఆరుముగం అన్నాడీఎంకే పార్టీ జిల్లా యువజన విభాగ ఉప కార్యదర్శిగాను, తిరుత్తణి నగర పాలక సంస్థ సభ్యుడిగా ఉన్నారు.పోలీసు స్టేషన్లో ఇతనిపై దాదాపు 12 కేసులున్నాయి. ఇదిలా ఉండగా వారం రోజుల క్రి తం స్థానిక బస్టాండు ప్రాం తంలో ఇతను వాకింగ్ వెళుతున్న సమయంలో హత్యాయత్నం జరిగింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తిరుత్తణి ఇంద్రానగర్‌లో ఉన్న వాటర్‌ప్లాంట్‌కు ఆరుముగం బయలుదేరారు. ఆ సమయంలో ఆటోలో వెంబడించిన దుండగు లు ఇతనిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. అయి తే వారి నుంచి తప్పించుకుని పారిపోతున్న సమయం లో వెనకాలే వచ్చిన దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆరుముగంను అటువైపుగా వచ్చిన కొంతమంది వ్యక్తులు తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలించిన కొంతసేపటికే ఆరుముగం మృతి చె ందాడు. రాస్తారోకో రణరంగం తమ నేత హత్య గురయ్యాడన్న విషయంతో ఆగ్రహం చెందిన అన్నాడీఎంకే శ్రేణులు నిరసనగా దుకాణాలను మూసి వేయించేందుకు ప్రయత్నించారు. సమాచారంతో అక్కడికి చేరుకున్న డీఎస్పీ ఈశవరన్ నేతృత్వంలోని పోలీసులు వీరిని అడ్డుకున్నారు. పోలీసులు తీరుకు నిరసనగా ఎంపీ హరి ఆధ్వర్యంలో దాదాపు 300 మంది చెన్నై బైపాస్ రోడ్డులో రాస్తారోకో చేపట్టారు. దీనికి కూడా పోలీసులు అడ్డు చెప్పడంతో అన్నాడీఎంకే శ్రేణులు ఎదురు తిరిగారు. జిల్లా ఎస్పీ శ్యాంసన్ సంఘటన ప్రాంతం చేరుకుని ఎంపీ, అన్నాడీఎంకే కార్యకర్తలకు సర్దిచెప్పారు. అయితే రాస్తారోకో విరమించి వెళుతున్న సమయంలో మళ్లీ డీఎస్పీ ఈశ్వరన్ వాహనాన్ని చుట్టుముట్టి దాడి చేయడంతో రాస్తారోకో రణరంగంగా మారింది. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేశారు. విలేకర్లకు తీవ్ర గాయాలు పోలీసులు లాఠీ చార్జి సమయంలో అక్కడే ఉన్న మాలై తమిళగం తమిళ పత్రిక విలేకరి కృష్ణనన్కు తీవ్ర గా యాలయ్యాయి. ఆంధ్రజ్యోతి, మాలైమురసు విలేకర్లు హరికుమార్శర్మ, వినోత్ తదితరులు గాయపడ్డారు. వీరిని వెంటనే తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. ఇదిలా ఉండగా 500 మంది పోలీసులు తిరుత్తణిలో మోహరించి బందోబస్తు నిర్వహిస్తున్నారు. హంతకుల కోసం గాలిస్తున్నాం: ఎస్పీ శ్యాంసన్ అన్నాడీఎంకే నేత దారుణహత్యకు సంబంధించి ఎస్పీ శ్యాంసన్ మాట్లాడుతూ హంతకుల కోసం ప్రత్యేక బృందాన్ని బరిలోకి దింపామని దుండగులను తొందర్లోనే తెలిపారు. -
రౌడీషీటర్ వాహెద్ దారుణ హత్య
► ప్రత్యర్థిగా మారిన అనుచరుడు ఫెరోజ్ ► పథకం ప్రకారం విందుకు పిలిచి ఘాతుకం ► జహీరాబాద్‌లో ఘటన ► దందాలో తలెత్తిన విభేదాలే కారణం జహీరాబాద్/సిటీబ్యూరో: హైదరాబాద్‌కు చెందిన రౌడీషీటర్ సయ్యద్ వాహెద్ (35) జహీరాబాద్‌లో దారుణహత్యకు గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక బృందావన్ కాలనీ వద్ద ఉన్న ఓ ఫాంహౌస్‌లో ఈ హత్య జరిగింది. సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న కథనం ప్రకారం... నగరంలోని బోరబండ పండిట్ నెహ్రూనగర్‌కు చెందిన పహిల్వాన్ వాహెద్‌పై సనత్‌నగర్ ఠాణాలో‡ రౌడీషీట్ ఉంది. ఇతడిపై 11 కేసులున్నాయి. మూడు హత్యలు, మరో మూడు రేప్ కేసుల్లో నిందితుడు. అంతేకాకుండా పండిట్ ¯ð హ్రూనగర్, రాజీవ్‌గాంధీ నగర్, యూసుఫ్ నగర్, వాహెద్ నగర్ ప్రాంతాల్లో తను అనుచరగణాన్ని ఏర్పాటు చేసుకొని నేరాలు, సెటిల్మెంట్లు చేసేవాడు. దీంతో పీడీ యాక్ట్ కింద ఏడాది పాటు జైల్లో ఉండి.. ఈనెల 4న జైలు నుంచి విడుదలయ్యాడు. అతని గ్యాంగ్‌లోనే కొనసాగిన కూకట్పల్లి ప్రాంతానికి చెందిన ఫెరోజ్ సొంతంగా గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని భూదందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నాడు. ఇతడిపై ఒక హత్యతో పాటు పలు కేసులున్నాయి. వాహెద్ జైల్లో ఉన్న సమయంలో ఫెరోజ్ తన దందాలు ఉధృతం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఇదిలా ఉండగా, గతంలో మాదిరిగా కలిసి పనిచేద్దామని ఫెరోజ్.. వాహెద్‌తో నమ్మబలికాడు. జహీరాబాద్‌లో విందు ఉందని, అక్కడికి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పాడు. జహీరాబాద్‌కు చెందిన ఇనాయత్తో బీదర్‌కు చెందిన వ్యక్తి ఫాంహౌస్‌లో ఫెరోజ్ విందు ఏర్పాటు చేయించాడు. 2.30 గంటల ప్రాంతంలో హత్య శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఫెరోజ్ తన అనుచరులు ఆరుగురితో హైదరాబాద్ నుంచి జహీరాబాద్ చేరుకున్నాడు. సాయంత్రం 6 గంటలకు వాహెద్ ఏడుగురు అనుచరులతో ఫాంహౌస్‌కు వచ్చాడు. ఫెరోజ్, అతడి మనుషులతో కలిసి గదిలో కూర్చుని వాహెద్ మద్యం తాగాడు. వాహెద్ అనుచరులు మాత్రం ఫాంహౌజ్ బయట కూర్చుని తాగారు. రాత్రి 2.30 గంటల ప్రాంతంలో వాహెద్‌పై ఫెరోజ్, అతని మనుషులు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశాడు. దీంతో వాహెద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని అనుచరులపై దాడికి యత్నించగా వారంతా పరారయ్యాడు. మృతుడి తమ్ముడు వసీం విషయం తెలుసుకొని ఉదయం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. డీఎస్పీ తిరుపతన్న, సీఐ నాగరాజు, ఎస్సైలు రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, హత్యకు గల కారణాలు సేకరించారు. విందు ఏర్పాటు చేసిన ఇనాయత్‌ను, ఫాంహౌస్ మేనేజర్ మొయిజ్‌ను విచారించారు. మద్యం, మగువలతో ఎర వాహెద్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన ఫెరోజ్ మద్యం, మగువలను ఎరివేసినట్టు తెలుస్తోంది. విందులో 25 మంది వరకు ఉండి ఉంటారని, వారిలో మహిళలు కూడా ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఒక మహిళను గదిలోకి పంపించిన అనంతరం ఫెరోజ్ మనుషులు వాహెద్‌పై దాడి చేసి ఉండొచ్చని తెలిపారు. హత్యకు గురైన సమయంలో వాహెద్ ఒంటిపై ఎలాంటి దుస్తులు లేవు, మహిళకు సంబంధించిన వస్రా్తలు కూడా పడి ఉన్నాయి. -
నగరంపై నయీం టెర్రర్!
► దారుణ హత్యలకు కేరాఫ్ అడ్రస్ ► ఐపీఎస్ వ్యాస్ నుంచి పటోళ్ళ వరకు... ► 2007లో నాంపల్లి కోర్టు నుంచి ఎస్కేప్ అతడి పేరు చెప్తే హక్కుల సంఘాల నేతలు సైతం ఉలిక్కిపడతారు...అనేక మంది రాజకీయ నాయకులూ హడలెత్తిపోతారు... మాజీ నక్సలైట్లు, మావోయిస్టులకూ కంటి మీద కునుకు ఉండదు... వ్యాపారులు, బడాబాబులైతే అతడి కన్ను తమ మీద పడకూడదని ఆశిస్తుంటారు. లెక్కలేనన్ని హత్యలు, బెదిరింపులతో పాటు సెటిల్మెంట్లు తన ఖాతాలో వేసుకుని మోస్ట్ వాంటెడ్‌గా మారిన నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం వ్యవహారమిది. కరుడుగట్టిన ఈ నేరగాడి పడగ నగరంలోనూ విస్తరించి ఉంది. ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య నుంచి పటోళ్ళ గోవర్థన్‌రెడ్డి మర్డర్ వరకు సిటీలో జరిగిన దారుణ హత్యలకు నయీం కేరాఫ్ అడ్రస్. సాక్షి, సిటీబ్యూరో: కరుడుగట్టిన నేరగాడు నయీముద్దీన్ కథలో ఆద్యంతాలు నగరానికి ‘తూర్పు పడమర’ల్లోనే జరిగాయి. సిటీకి తూర్పు దిక్కున ఉన్న నల్లగొండ జిల్లా భువనగిరి నయీం స్వస్థలం. సమ సమాజ స్థాపన కోసం అంటూ మూడున్నర దశాబ్ధాల క్రితం పీపుల్స్ వార్‌లో చేరడం, నక్సల్స్‌ను అంతం చేయడమే తన జీవితాశయం అంటూ ప్రకటించడం, కోవర్టుగా మారడం, బెదిరింపుల వరకు బరితెగించడం... ఇలా ప్రతిఘట్టంలోనే సిటీ ‘పాత్ర’ సుస్పష్టం. సుదీర్ఘకాలం పరారీలో ఉండి, పోలీసుల్ని ‘ముప్పతిప్పలు’ పెట్టి ఎట్టకేలకు సోమవారం ఎన్కౌంటర్లో హతమైన షాద్‌నగర్ ప్రాంతం సిటీకి పడమర దిక్కున ఉంది. ఇలా నయీముద్దీన్ ‘ఉదయాస్తమానాలు’ నగరానికి తూర్పు, పడమర దిక్కుల్లోనే జరిగాయి. హత్య చే(యి)స్తే దారుణమే... నయీం చేసిన అనేక దారుణహత్యల్ని ఎప్పటికీ ప్రజలు మర్చిపోలేరు. అజ్ఞాతంలో ఉండగానే భువనగిరిలో వెలుగులోకి వచ్చిన బెల్లి లలిత అత్యంత దారుణ హత్యతో అతడి పేరు మారుమోగింది. గ్రేహౌండ్స్‌కు ఆద్యుడైన ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్, పౌర హక్కుల నేత పురుషోత్తం, వ్యాపారవేత్త రామకృష్ణ, రివల్యూషనరీ పేట్రియాటిక్ టైగర్స్ (ఆర్పీటీ) వ్యవస్థాపకుడు, ఘరానా నేరగాడు పటోళ్ల గోవర్థన్‌రెడ్డి... ఇలా అనేక దారుణ హత్యలకు నయీం, అతడి గ్యాంగ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయి. ఈ కేసులకు సంబంధించి అనేక కోర్టుల్లో ఇతడిపై నాన్–బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం నయీం నిందితుడిగా ఉన్న ఐపీఎస్ వ్యాస్ హత్య కేసు, 2005 నాటి రాజస్థాన్ ఆయుధాల కేసు నాంపల్లి కోర్టులో విచారణలో ఉన్నాయి. ఈ రెండు కేసుల్లోనూ మిగిలిన నిందితులపై అభియోగాలు వీగిపోయినా, శిక్షలు పడినా నయీం పరారీలో ఉండటంతో అతడిపై విచారణకు బ్రేక్ పడింది. ఫిర్యాదు చేసేందుకూ హడలే... ఐపీఎస్ వ్యాస్ హత్య కేసులో అరెస్టు అయిన నయీం తన పంథా మార్చుకుని నక్సల్స్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘గ్రీన్‌టైగర్స్’ పేరుతో 2000 నవంబర్ 23న సరూర్‌నగర్ పరిధిలోని మధుపురికాలనీలో ఏపీసీఎల్సీ నేత పురుషోత్తమ్‌ను పట్టపగలు దారుణంగా హత్య చేశాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే మరో ఏపీసీఎల్సీ నేతనూ కిడ్నాప్ చేశాడు. దాదాపు వారం రోజుల పాటు నిర్భంధించి, తీవ్రంగా బెదిరించిన తర్వాత గుండు గీయించి మరీ వదిలిపెట్టాడు. చెర నుంచి బయటకు వచ్చిన ఆయన కనీసం పోలీసులకు ఫిర్యాదు చేసే ధైర్యమూ చేయలేదు. ‘గుండు’ విషయం అడిగితే పుణ్యక్షేత్రాల పేరు చెప్పి ‘తప్పించుకున్నారు’. -
మహిళ దారుణ హత్య
కొనకనమిట్ల మండలం వద్దిమడుగు గ్రామంలో ఆళ్లచెరువు అనురాధ(40) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. గ్రామానికి చెందిన బద్రి గురుమూర్తి అనే వ్యక్తే గొంతు పిసికి చంపి ఉంటాడని అనురాధ తండ్రి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆమె 15 ఏళ్లుగా భర్తతో విడిగా ఉంటోంది. గురుమూర్తి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి గురుమూర్తే మంగళవారం వేకువజామున గొంతు పిసికి చంపి ఉంటాడని భావిస్తున్నారు. ఉదయం తండ్రి చూసేసరికి అనురాధ నిర్జీవంగా పడి ఉంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
నల్లగొండ జిల్లాలో దారుణ హత్య
నల్లగొండలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడే మామను రోకలి బండతో మోది చంపాడు. ఈ సంఘటన జిల్లాలోని మఠంపల్లి మండలం ఉమ్లాతండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన భూక్య రాములు(60) కూతురికి జామ్లతండాకు చెందిన భానోతు సైదులుతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. గత కొన్ని రోజులుగా మామా అల్లుళ్ల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు రాములు తన అల్లుడు సైదులు ఇంటి ఎదురుగా నిలబడి.. దూషిస్తూ.. అతని ఇంటిపై రాళ్లు విసిరాడు. దీంతో కోపోద్రిక్తుడైన సైదులు పక్కనే ఉన్న రోకలిబండతో అతని తలపై బలంగా మోదాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వికారాబాద్‌లో మహిళ దారుణ హత్య
వికారాబాద్ మండలం అంతగిరిపల్లె సమీపంలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. గుర్తుతెలియని దుండగులు మహిళను బాగా కొట్టి చంపినట్లు తెలుస్తోంది. మృతురాలు తాండూరుకు చెందిన వరలక్ష్మి(36)గా గుర్తించారు. సంఘటనాస్థలానికి జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరీ చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్ బృందంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రా‘బంధువు’!
గుప్తనిధుల పేరుతో పెదనాన్న కుమారుడికి ఎర రూ.15 లక్షల లాభమంటూ రూ.1.5 లక్షలు స్వాహా డబ్బు కోసం నిలదీయడంతో దారుణ హత్య ప్రధాన నిందితుడి అరెస్టు, పరారీలో ఇద్దరు నాగపూర్ వాసులు సనత్‌నగర్: గుప్తనిధులపై అతడికున్న బలహీనతను క్యాష్ చేసుకున్న బంధువే రాబందువయ్యాడు... ‘పెట్టుబడిగా’ పెట్టిన మొత్తాన్ని తిరిగి ఇవ్వమన్నందుకు కర్కశంగా హతమార్చాడు... ఎస్సార్‌నగర్ ఠాణాలో మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ మర్డర్‌ను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న ఇద్దరు నాగ్‌పూర్ వాసుల కోసం గాలిస్తున్నారు. పశ్చిమ మండల డీసీపీ ఎం.వెంకటేశ్వరరావు బుధవారం పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి ఎస్సార్‌నగర్ ఠాణాలో విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... నాగ్‌పూర్ వాసులతో ‘గుప్త’ పరిచయం... మెదక్ జిల్లా మునిపల్లి మండలం మున్సానిపల్లెకు చెందిన చిన్నోళ్ల చంద్రారెడ్డి కుమారుడు చిన్నోళ్ల మాణిక్యరెడ్డి జీవనోపాధి కోసం నగరానికి వచ్చి మియాపూర్‌లో ఉంటున్నాడు. ఐదేళ్ల క్రితం మహారాష్ట్రకు వెళ్లినప్పుడు నాగ్‌పూర్ కాచునానికి చెందిన శైలేష్, పదమ్లతో ఇతడికి పరిచయమైంది. వీరు కొన్నాళ్ల క్రితం మాణిక్యరెడ్డికి 1818 ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన కాయిన్ (నాణెం) చూపించి తమ వద్ద గుప్తనిధులు ఉన్నాయని, వాటిని వెలికితీయడానికి కొంతపెట్టుబడి అవసరమని చెప్పారు. దీంతో అతడు తన వద్ద ఉన్న రూ.2 లక్షలను పెట్టుబడిగా పెట్టాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు శైలేష్, పదమ్లను గుప్తనిధుల విషయం అడగ్గా... వెలికి తీసేందుకు ఇంకా పెట్టుబడి అవసరమని మరో రూ.2.5 లక్షలు ఇస్తే పని పూర్తవుతుందన్నారు. ఆ నిధులు అమ్మగా వచ్చిన డబ్బులో రూ.15 లక్షలు ఇస్తామని నమ్మబలికారు. గుప్తనిధుల పేరుతో డబ్బు కాజేసి... దీంతో మాణిక్యరెడ్డి తన వద్ద డబ్బులు లేకపోవడంతో ఎర్రగడ్డలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న చిన్నాన్న కుమారుడు చిన్నోళ్ల సంతోష్‌రెడ్డి (28)కి ఫోన్ చేశాడు. మహారాష్ట్రలో గుప్తనిధులు ఉన్నాయని, నీవు రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే 15 రోజుల్లో నీకు రూ.15 లక్షలు లాభంగా వస్తుందని చెప్పాడు. మాణిక్యరెడ్డి మాటలు నమ్మిన సంతోష్ రూ.1.5 లక్షలు ఇచ్చాడు. 15 రోజులు గడిచినా తన వాటా డబ్బు రాకపోవడంతో సంతోష్ మాణిక్యరెడ్డిని నిలదీశాడు. దీంతో జనవరి 28న గుప్తనిధులు చూపిస్తానంటూ సంతోష్‌ని నాగ్‌పూర్ తీసుకువెళ్లాడు. అక్కడకు వెళ్లాక... ఆ నిధులు అమ్మేవారిని తానే హైదరాబాద్‌కు తీసుకొస్తానని చెప్పి మరుసటి రోజు బస్సులో వెనక్కి పంపించాడు. చందానగర్ లాడ్జిలో హత్యకు కుట్ర... డబ్బు కోసం సంతోష్ ఒత్తిడి పెంచడంతో జనవరి 30న మాణిక్యరెడ్డి, నాగ్‌పూర్‌కు చెందిన శైలేష్, పదమ్లు చం దానగర్లోని ఓ లాడ్డిలో సమావేశమయ్యారు. రూ.15 లక్షలు సంతోష్‌కు ఎందుకివ్వాలి? అతన్ని చంపిస్తే మనమే వాటిని పంచుకుందామంటూ కుట్ర పన్నారు. దీన్ని అమలు చేయడంలో భాగంగా 31న సంతోష్‌కు ఫోన్ చేసిన మాణిక్యరెడ్డి మియాపూర్‌కు పిలిపించి తన ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని నర్సాపూర్ రహదారిలో బయలుదేరాడు. గాగిల్లాపూర్ వద్ద స్వప్న వైన్‌షాపులో మద్యం ఖరీదు చేశాడు. గుప్త నిధుల గురించి మాట్లాడుకుందామని నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని మేడాలమ్మ గుడి వద్దకు తీసుకెళ్లాడు. చంపి, కాల్చేశారు... ఆ ఆలయం వద్ద బైక్ పార్క్ చేసిన మాణిక్యరెడ్డి... సంతోష్‌ను అడవి లోపలికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న శైలేష్, పదమ్లతో కలిసి నలుగురూ మద్యం తాగారు. సంతోష్ మద్యం మత్తులోకి జారుకోగానే... అందరూ నిద్రించినట్లుగా నటించారు. సంతోష్ పూర్తిగా నిద్రలోకి జారుకున్న తర్వాత మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో పక్కనే ఉన్న బండరాళ్లతో తలపై మోది అతడిని హత్య చేశారు. శవాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు మృతదేహంపై ఉన్న దుస్తులు విప్పి, బైక్ నుంచి తీసిన పెట్రోల్ పోసి కాల్చేశారు. ఫిబ్రవరి 5న సంతోష్ ఫోన్ నుంచి ‘నేను పనిపై బయటకు వచ్చా.. త్వరలోనే తిరిగి వస్తా’నంటూ కుటుంబీకులకు ఎస్సెమ్మెస్ పంపారు. ఆపై సంతోష్‌కు చెందిన రెండు సెల్ఫోన్లు మియాపూర్ నాలాలో పడేశారు. మిస్సింగ్ మిస్టరీ వీడిందిలా... సంతోష్ ఆచూకీ లభించకపోవడంతో తండ్రి నర్సింహ్మారెడ్డి పలుచోట్ల గాలించాడు. ఫలితం లేకపోవడంతో ఫిబ్రవరి 10న ఎస్సార్‌నగర్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా సంతోష్ ఫోన్ల కాల్ డేటాను అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అతడికి వచ్చిన కాల్స్‌లో అనుమానాస్పదంగా ఉన్న ఓ నెంబర్‌ను గుర్తించారు. ఆ నెంబర్ సోదరుడు మాణిక్యరెడ్డిదిగా తేలడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించడంతో అరెస్టు చేశారు. నాగ్‌పూర్‌కు చెందిన ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ సతీష్, ఎస్సైలు శ్రీనివాస్, నగేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. మరోపక్క సంతోష్ మిస్సింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యం వహించారంటూ అతడి బంధువులు బుధవారం ఠాణా వద్ద కొద్దిసేపు ఆందోళన చేశారు. -
వృద్ధురాలి దారుణ హత్య
పట్టపగలే కనకాద్రిపల్లెలో ఘటనదర్యాప్తు చేపట్టిన పోలీసులు కొలిమిగుండ్ల: పట్టపగలు ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. కొలిమిగుండ్ల మండల పరిధిలోని కనకాద్రిపల్లె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కనకాద్రిపల్లెకు చెందిన బోయలదిన్నె వెంకటలక్ష్మమ్మ(63) ప్రధాన రహదారి పక్కన ఇటీవలే కొత్తగా ఇల్లు నిర్మించుకుంది. నాలుగు నెలల క్రితం భర్త భూషన్న అనారోగ్యంతో మృతి చెందాడంతో ఆ ఇంట్లోనే జీవనాధారంగా బట్టలు,చెప్పుల దుకాణం నడుపుకుంటుంది. గురువారం ఉదయం ఒంటరిగా ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించి అతి కిరాతకంగా గొంతు కోసినట్లు తెలుస్తోంది. మధ్యాహ్న సమయంలో ఈమె ఇంటి పక్కనే ఉన్న టీకొట్టుకు పాలు పోసేందుకు వచ్చిన మహిళ రక్తం మడుగులో ఆచేతనంగా పడి ఉన్న వెంకటలక్ష్మమ్మను గుర్తించి స్థానికుల తెలియజేసింది. వీరు పోలీసులకు సమాచారమివ్వడంతో కోవెలకుంట్ల సీఐ పీటీ కేశవరెడ్డి,ఎస్ఐ పులిశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గంగాదేవిపల్లె సమీపంలోని ఇగుడూరు గంగమ్మ ఆలయంలో పూజారిగా పని చేసే విషయంలో కొంత కాలం నుంచి సమీప బంధువులతో మృతురాలికి వివాదం నడుస్తోంది. ఈ విషయంలోనే అడ్డుతొలగించుకోవాలనే ఉద్దేశంతో వెంకటలక్ష్మమ్మను దారుణంగా హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా వారికి వివాహాలయ్యాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
యువకుడి దారుణ హత్య
యువకుడిని దారుణంగా హత్య చేసి రోడ్డు పక్కన పడేసిన సంఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అభినవనగర్ కాలనీ కమ్యూనిటి హాల్ వద్ద గురువారం వెలుగుచూసింది. మహమ్మద్ గూడకు చెందిన షరీఫ్(28)ను గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా హతమార్చి రోడ్డు పక్కన పడేసి వె ళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
మేయర్ పోస్టుమార్టం పూర్తి
-
మేయర్ దంపతుల పోస్టుమార్టం పూర్తి
చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం దారుణహత్యకు గురైన చిత్తూరు మేయర్ అనురాధ మృతదేహానికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వేలూరు ప్రభుత్వాసుపత్రిలో మేయర్ భర్త కఠారి మోహన్ మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. బుధవారం పోస్టుమార్టం చేసిన అనంతరం మేయర్ భౌతికకాయాన్ని పార్టీ కార్యకర్తల సందర్శనార్ధం చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి తరలించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు వీరి మృతదేహాలకు కార్పొరేషన్ కార్యాలయంలో టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించనున్నారు. చిత్తూరు మేయర్ కార్పొరేషన్ కార్యాలయానికి విచ్చేసిన పలువురు నేతలు అనురాధ మృతదేహానికి నివాళులర్పించారు. కాసేపట్లో చిత్తూరుకు కఠారి మోహన్ మృతదేహాన్ని తరలించనున్నారు. -
ప్రశ్నించడానికెళ్తే ప్రాణం తీశారు..
ఏలూరు అర్బన్: తమ్ముడి కోసం వెళ్లి అన్న మృత్యువాత పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిందితుల కుటుంబంపై మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు దాడి చేసి ఇల్లు తగులబెట్టారు. నిందితుల కుటుంబంలోని ఇద్దరు మహిళలను స్తంభానికి కట్టేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అసలేం జరిగిందంటే.... మా తమ్ముడిని చంపుతానన్నావట అసలేం జరిగింది... అని అడిగేందుకు వెళ్లిన అన్న హత్యకు గురయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న కుమారుడి మృతదేహాన్ని చూసి తండ్రి మృతిచెందాడు. ఒకే ఇంట ఇద్దరి మరణాలు చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని శనివారపు పేటకు చెందిన లంకపల్లి చింతారావు, లంకపల్లి శేఖర్ అన్నదమ్ములు. వీరిద్దరూ జులాయిగా తిరుగుతూ స్థానికంగా రౌడీయిజం చెలాయిస్తుంటారు. ఆదివారం మధ్యాహ్నం చింతారావు మద్యం తాగి బైకుపై వస్తూ స్థానిక కమ్యూనిటీ హాలు వద్ద కూర్చున్న పలిపే మార్యూ, తేరా రవితో గొడవకు దిగాడు. దుర్భాషలాడుతూ చంపుతానంటూ కత్తి చూపి వారిని బెదిరించాడు. భయపడిన మార్యూ, రవి అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న రవి అన్న సంజీవరావు.. చింతారావు ఇంటికి వెళ్లి మా తమ్ముణ్ణి చంపుతానన్నావట అసలేం జరిగిందని అడుగుతూండగానే చింతారావు, అతని సోదరుడు శేఖర్ పక్కనే ఉన్న సమ్మెటతో సంజీవరావు తలపై బలంగా మోదడంతో తల పగిలి కనుగుడ్లు బయటకు వచ్చాయి. సంజీవరావు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. హత్యకు పాల్పడిన అన్నదమ్ములిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఇది గమనించిన మృతుడి బంధువు తేరా లక్ష్మయ్య కేకలు పెడుతూ గ్రామంలోకి పరుగులు పెట్టాడు. సంజీవరావు హత్యకు సంబంధించి సమాచారం అందుకున్న త్రీటౌన్ ఎస్సై మాతంగి సాగరబాబు, సీఐ ఎన్.రాజశేఖర్, ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టా రు. అనంతరం మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డీఎస్పీ సరిత మాట్లాడుతూ నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు ప్రారంభించామన్నారు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తండ్రి మృతి తన కుమారుడు హత్యకు గురయ్యాడని తెలిసిన సంజీవరావు తండ్రి నాగేశ్వరరావు ఘటనా స్థలికి చేరుకున్నాడు. తలపగిలి రక్తపు మడుగులో పడి ఉన్న కొడుకును చూసిన నాగేశ్వరరావు తల్లడిల్లిపోయాడు. కొడుకు మృతదేహం వద్ద కుప్పకూలిపోయాడు. నాగేశ్వరరావును బంధువులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని నిర్ధారించారు. కన్నీరు మున్నీరుగా విలపించిన మృతుని భార్య వ్యవసాయ కూలీ అయిన సంజీవరావుకు ఆరునెలల కిందట స్వాతి అనే యువతితో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె గర్భవతి. భర్త రక్తపు మడుగులో ప్రాణాలు వదలడం చూసిన స్వాతి కన్నీరు మున్నీరుగా విలపించింది. -
పొదిలిలో యువకుని హత్య
కోడి పందాలు ఓ యువకుడి నిండు ప్రాణాలు తీశాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పొదిలి గ్రామంలోని శ్రీపతినగర్‌లో సోమవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు ఒక యువకుని కత్తులతో పొడిచి హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(27) కోడిపందేలు ఆడేవాడు. కాగా.. అక్కడ కొంత మంది తో ఘర్షణలు తలెత్తాయి. అక్కడ జరిగిన గొడవ కారణంగా కొందరు వ్యక్తులు సోమవారం మధ్యాహ్నం వెంకటేశ్వర్లుపై కత్తులతో దాడి చేశారు. అతడిని అతి కిరాతకంగా చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాలేటివారిపాలెంలో దారుణం
-
వాలేటివారిపాలెంలో దారుణం
వాలేటివారిపాలెం మండలం పోకూరి గ్రామంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ సైకో నాలుగేళ్ల బాలుడి గొంతు కోశాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మహేంద్ర, ఆదిలక్ష్మిల రెండో కుమారుడు మను సాగర్(4) ఇంటి దగ్గర ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు కంగారుపడి వెతకడం ప్రారంభించారు. తిరుమలరావు(35) అనే వ్యక్తి మనుసాగర్ ను తీసుకెళ్లాడని స్థానికులు చెప్పడంతో.. అతడి ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసుకుని బయటికి వెళ్లబోయిన తిరుమల రావును తల్లిదండ్రులు ప్రశ్నించగా.. ఇంట్లో ఉన్నాడు చూసుకోండని సమాధానమిచ్చాడు. తలుపులు తెరిచి చూడగా.. బాలుడి తల వేరుచేసి ఉంది. ఇది చూసి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు తిరుమల రావు ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తిరుమలరావును కందుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లక్ష్మీదేవిని హత్య చేసింది మరిదే!
చాపాడు: మండల పరిధిలోని విశ్వనాథపురం గ్రామంలో ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం దారుణ హత్యకు గురైన భూమిరెడ్డి లక్ష్మీదేవిని మనస్పర్థల కారణంగానే మరిది అయిన భూమిరెడ్డి ఓబుళరెడ్డి హత్య చేశాడు. గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఈ మిస్టరీ వీడింది. ఈ మేరకు ఓబుళరెడ్డి సోమవారం ఉదయం వీఆర్వో సుమలత ముందు లొంగిపోయి తానే లక్ష్మీదేవిని హత్య చేసినట్లు అంగీకరించాడు. వీఆర్వో నిందితుడిని రూరల్ సీఐ భాస్కర్‌రెడ్డికి అప్పజెప్పారు. హత్యకు పాల్పడిన ఓబుళరెడ్డిని సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసి డీఎస్సీ శ్రీనివాసులరెడ్డి, రూరల్ సీఐ భాస్కర్‌రెడ్డిల సమక్షంలో ఎస్ఐ గిరిబాబు విలేకరుల ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ విశ్వనాథపురానికి చెందిన భూమిరెడ్డి గురివిరెడ్డికి, సోదరుడు ఓబుళరెడ్డికి పొలాల వద్ద సమస్యలుండేవి. రోజురోజుకు మనస్పర్థలు అధికమయ్యాయి. గురివిరెడ్డి గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధంతో వేరే గ్రామంలో ఉన్నాడు. గురివిరెడ్డి భార్య లక్ష్మీదేవి, ఓబుళరెడ్డి తరుచూ గొడవలు పడుతుండేవారు. ఇదే క్రమంలో ఈ నెల 10వ తేదీన పొలం దగ్గర, ఇంటి వద్ద కూడా గొడవ పడ్డారు. మధ్యాహ్నం 1.30గంట సమయంలో లక్ష్మీదేవి తన ఇంటి వద్ద వరండాలో మంచంపై నిద్రిస్తుండగా, ఎవ్వరూ లేరని భావించిన ఓబుళరెడ్డి ఇంటిలోని రోకలిబండతో తలపై, ముఖంపై నాలుగైదుసార్లు బలంగా కొట్టాడు. దీంతో లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా, సోమవారం నిందితుడే తానే హత్య చేశానని ఒప్పుకుని లొంగిపోయాడని డీఎస్పీ వివరించారు.