సాక్షి, బళ్లారి :
అన్నదమ్ముల్లా ఉన్న తెలంగాణ, సీమాంధ్రులను ముక్కలు చేయడం దారుణమని ప్రవాసాంధ్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు దేశంలోనే ఓ ప్రత్యేకత ఉందని, రాజకీయ స్వార్థంతో సోనియాగాంధీ నియంతలా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను విభజించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నీఛ రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా యావత్ దేశ ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి పుట్టగతులుండవని మండిపడ్డారు.
రాయలసీమ పూర్తిగా వెనుకబడి పోతుంది :
భారత దేశ సంస్కృతి, వారసత్వాల గురించి ఏ మాత్రం అవగాహన లేని సోనియాగాంధీ స్వార్థ పూరితమైన ఆలోచనలతో తన కుమారుడు రాహుల్‌ను ప్రధానమంత్రి చేయాలని అన్నదమ్ముల్లా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను రెండు ముక్కలు చేసింది. ప్రత్యేక తెలంగాణా బిల్లును పార్లమెంటులో ఆమోదించడం దేశ చరిత్రలోనే దుర్దినం. రాయలసీమ పూర్తిగా వెనుకబడి పోతుంది.
శశికళ, మాజీ ఉపమేయర్
హేయమైన చర్య
ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం హేయమైన చర్య. కోట్లాది మంది తెలుగు వారి ఆవేదన కాంగ్రెస్ పార్టీకి చెవికెక్కలేదు. అన్నంత పని చేసి తెలంగాణా బిల్లుకు లోక్‌సభలో ఆమోదం తెలిపి సీమాంద్రులకు తీవ్ర అన్యాయం చేశారు. తెలుగు వారిని విడగొట్టిన పాపం పాలకులను వెంటాడుతుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారు. - రాంప్రకాష్‌రెడ్డి, బస్సు ఓనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు
సీమాంధ్రకు తీవ్ర అన్యాయం
ప్రత్యేక తెలంగాణా బిల్లు లోకసభలో ఆమోదం పొందడం ఎంతో బాధించింది. కోట్లాది మంది ప్రజల మనోభావాలకు దెబ్బ తగిలింది. ఒక ప్రాంతంలో మోదం, మరో ప్రాంతంలో ఖేదం కలిగించేలా బిల్లును ఆమోదించడం తగదు. అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాల్సింది పోయి పాలకులు రాజకీయంగా లాభపడాలని ప్రత్యేక తెలంగాణా ఇచ్చారు. ఇది దారుణం. - శ్రీమన్నానారాయణ, ప్రవాసాంధ్రుడు
కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు
అన్నదమ్ముల్లా ఉన్న తెలుగువారిని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధిచెబుతారు. ప్రత్యేక తెలంగాణా ఇవ్వడం వల్ల రాయలసీమ, కోస్తాంధ్ర రెండు ప్రాంతాలకు తీవ్ర అన్యాయం చేసినట్లయింది. తెలంగాణా బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడం యావత్ ఆంధ్రులను మనోవేదనకు గురి చేసింది. ప్రత్యేక తెలంగాణా బిల్లు ఆమోదం ఏమాత్రం సక్రమంగా లేదు. - చెంచు కృష్ణారెడ్డి, క్లాస్ 1 కాంట్రాక్టర్
ఆంధ్రప్రదేశ్ విభజన దారుణం
Published Wed, Feb 19 2014 6:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM
Advertisement
Advertisement