
కన్నడంలో అంజలి
నటి అంజలి దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒక రౌండ్ కొట్టేసే ప్రయత్నంలో ఉన్నట్లున్నారు.
నటి అంజలి దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒక రౌండ్ కొట్టేసే ప్రయత్నంలో ఉన్నట్లున్నారు. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో నటిగా గుర్తింపు పొందిన ఈ తె లుగమ్మాయి తాజాగా కన్నడంలోనూ తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. ఆ మధ్య తెలుగులో నాలుగైదు చిత్రాలు చేసేశారు. ఇక కోలీవుడ్‌లో ఆమె పని అయిపోయినట్టేనని భావించిన వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ తాజాగా జయం రవితో అప్పాటక్కర్ అనే చిత్రంలోను, శివకార్తికేయన్ సరసన మాప్పిళ్లై సింగం చిత్రంలోను నటించే అవకాశాలు దక్కించుకున్నారు.
ప్రస్తుతం ఈ రెండు చిత్రాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. అంజలి తాజాగా కన్నడంలో ధీర రాణా విక్రమ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్న అంజలి అందులో తన పాత్రకు తనే డబ్బింగ్ చెపుకోవాలని నిర్ణయించుకున్నారట. కన్నడ భాష ఒక అక్షరం తెలియకున్నా డబ్బింగ్ చెప్పాలని కంకణం కట్టుకోవటం ఆమె సన్నిహిత వర్గాల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోందని సమాచారం. దీంతో వారు ఇప్పుడే డబ్బింగ్ జోలికి పోక మరి కొన్ని చిత్రాలు చేసిన తరువాత ఆ ప్రయత్నంచేస్తే బాగుంటుందని హితవు పలుకుతున్నారట. మరి అంజలి ఏం చేస్తుందో చూడాలి.