బీప్ సాంగ్ ప్రసారం చేయొద్దు
చెన్నై : శింబు బీప్ సాంగ్ కేసు శింబును అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో శింబు ముందస్తు మెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తాను నటుడిని మాత్రమే కాకుండా గాయకుడిని కూడానని పలు చిత్రాల్లో పాడినట్లు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్ పాటలు పాడుతున్నట్లు, అలా పాడిన ఒక డమ్మీ పాటనే బీప్ సాంగ్ అని దాన్ని తాను ఏ సోషల్ నెట్ వర్క్స్‌లోనూ ప్రచారం చేయలేదని, అలా దొంగతనంగా ప్రచారం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బీప్ సాంగ్ వ్యవహారంలో తన తప్పు ఏమీలేదని తెలిపారు.
ఈ కేసు సోమవారం న్యాయమూర్తి టీ.రాజేంద్రన్ సమక్షంలో విచారణకు వచ్చింది. నటుడు శింబు తరపున న్యాయవాది ముత్తు రామసామి, పోలీసుల తరపున హాజరైన న్యాయవాది ముహమదు రాయాజుద్ధీన్ హాజరయ్యారు. వాదోపవాదాలు విన్న తరువాత న్యాయమూర్తి బీప్ సాంగ్‌ను దీంతో ఆ పాటను ఇంటర్నెట్, ఫేస్‌బుక్‌లో ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు.అదే విధంగా శింబుకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేయడానికి నిరాకరించారు.
ఆ ప్రముఖ నటుడు ఎవరు?
కాగా శింబు రాసి, పాడిన బీప్ సాంగ్‌కు సంగీత దర్శకుడు అనిరుద్ బాణీలు కట్టినట్లు దాన్ని స్నేహం కోసం, ఆకతాయితనంగానూ తన సన్నిహిత మిత్రుడైన ప్రముఖ నటుడికి పంపినట్లు ఆయన ఆ పాటను సీరియస్‌గా తీసుకోకుండా వాట్సాప్ లో పోస్ట్ చేసినట్లు సమాచారం. పోలీసులు ఇప్పుడు ఆ కోణంలో దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు తెలిసింది. ఇంతకీ ఆ ప్రముఖ నటుడెవరన్న అంశం కోలీవుడ్‌లో కలకలం రేకెత్తిస్తోంది.