కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి.
బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. ప్రస్తుతం డ్యాంలో కేవలం 1.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. డ్యాంలోకి ఈ ఏడాది 80 టీఎంసీలకు మించి నీరు చేరలేదు. ప్రతి ఏటా డ్యాం ఆయకట్టు పరిధిలో ఖరీఫ్‌తో పాటు రబీలోనూ పంటలు పండించే వారు. కానీ ఈ ఏడాది ఒకే పంట పండించాల్సి వచ్చింది.