చిన్న నోట్ల దుమ్ము దులుపుతున్నారు..
హుస్నాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సిద్ధిపేట జిల‍్లా హుస్నాబాద్ పట్టణంలోని బ్యాంక్‌ల వద్ద ఉన్న చిన్న నోట్లకు డిమాండ్ వచ్చిపడింది. పోలీసు బందోబస్తు మధ్య బ్యాంకుల్లో నోట్లు మార్పిడి, డిపాజిట్ కోసం ఉదయం నుంచే క్యూ లైన్లలో జనం నిరీక్షించారు. ఇప్పటిదాకా పెద్ద నోట్లు తప్ప 10, 20 రూపాయల నోట్లను తీసుకునేందుకు జనం ముందుకు రాకపోవటంతో అవి బ్యాంకుల్లో పేరుకుపోయాయి. కానీ, పట్టణంలోని బ్యాంకులకు కొత్త నోట్లు అందకపోవటంతో రూ.10, రూ. 20 నోట్ల దుమ్ము దులిపే అవకాశం వచ్చింది. దీంతో డబ్బు డ్రా చేసుకునే వినియోగదారులకు అధికారులకు చిన్న నోట్లు మాత్రమే ఇస్తున్నారు.