సాక్షి, న్యూఢిల్లీ: పలుమార్లు వాయిదా పడిన డీడీఏ హౌజింగ్ స్కీమ్-2014 లక్కీ డ్రా మంగళవారం విజయవంతంగా ముగిసింది. డ్రా ఫలితాలను సాయంత్రం డీడీఏ వెబ్‌సైట్‌పై ఉంచారు. అయినప్పటికీ డ్రా ఫలితాలను తెలుసుకోవడం కోసం దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) ప్రధాన కార్యాలయం వద్దకు తరలి వచ్చారు. అన్ని సదుపాయాలతో ఫ్లాట్లను పూర్తిగా నిర్మించిన తరువాతనే విజేతలకు కేటాయిస్తామని డీడీఏ వైస్‌చైర్మన్ బల్విందర్‌కుమార్ తెలిపారు. ప్లాట్ల చెల్లింపులు ఆన్‌లైన్‌లోనే చేయాలన్నారు. డిసెంబర్ నాటికి దాదాపు అన్ని ఫ్లాట్లు సిద్ధమవుతాయని ఆయన తెలిపారు. డ్రా విజేతలు ఫ్లాట్ల కేటాయింపుల పత్రాలను స్వయంగా తీసుకోవాలని అన్నారు. డాక్యుమెంట్లు సమర్పించడం కోసం డీడీఏ 15 రోజుల పాటు వికాస్ సదన్‌లో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తుందన్నారు. రోహిణిలో 3,914 ఫ్లాట్లు, సిరస్‌పుర్‌లో 2,840 ఫ్లాట్లు వచ్చే సంవత్సరం వరకు సిద్ధమవుతాయని ఆయన చెప్పారు.
రెండు దశల్లో డ్రా..: డీడీఏ ప్రధాన కార్యాలయంలో రెండు దశలలో డ్రా ప్రక్రియ నిర్వహించారు. ఉదయం 9 గంటలకు రాండమైజేషన్ ప్రక్రియ మొదలై దాదాపు రెండు గంటల తరువాత ముగిసింది. మధ్యాహ్నం 12.15 గంటలకు కంప్యూటరైజ్డ్ డ్రా ఆప్ లాట్స్ కార్యక్రమం ప్రారంభమై 2 గంటలకు ముగిసింది. న్యాయమూర్తులు, నిఫుణులతో కూడిన త్రిసభ్య సంఘం మొదట సీడ్ నంబర్లను ఎంపిక చేశారు. ఈ కమిటీలో ఢిల్లీ ైెహ కోర్టు మాజీ న్యాయమూర్తి మంజు గోయల్, ఐఐటీ ప్రొఫెసర్ అంజుకుమార్, ఇన్ఫర్మేషన్ డైరక్టర్ మహేష్ చంద్ర సభ్యులుగా ఉన్నారు. మొత్తం 25,040 ఫ్లాట్లలో 22 వేల ఎల్‌ఐజీ, 21 హెచ్‌ఐజీ, 49 ఎంఐజీ, 1195 జనతా, 700 ఈడబ్ల్యుఎస్ ప్లాట్లున్నాయి. వీటి కోసం 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదట శారీరక వికలాంగుల డ్రా ప్రక్రియ నిర్వహించారు. ఆ తరువాత పదవీ విరమణ పొందిన సైనికోద్యోగులు, అమరులైన సైనికుల భార్యలు. షెడ్యుల్డు కులాలు, తెగల వారికి సంబంధించిన డ్రా నిర్వహించారు. ఫ్లాట్లలో 15 శాతం షెడ్యూల్డు కులాల కోసం. 7.5 శాతం షెడ్యూల్డు తెగలవారి కోసం, 1 శాతం అమరులైన సైనికుల భార్యల కోసం, 1 శాతం పదవీ విరమణ చేసిన సెనికోద్యోగుల కోసం, 3 శాతం ఫ్లాట్లు వికలాంగుల కోసం కేటాయించారు.
డీడీఏ నిర్ణయం సరైనదే: హైకోర్టు
న్యూఢిల్లీ: నగరంలో ఇప్పటికే ఆవాసం ఉన్నవారు మరొక ఫ్లాట్‌కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లేదంటూ ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) నియంత్రణ విధించడాన్ని హైకోర్టు సమర్థింది. ఈ నిర్ణయం సరైనదేనని పేర్కొంది. ఇందుకు విరుద్ధం గా దాఖలైన పిటిషన్‌లను విచారించిన ప్రధాన న్యా య మూర్తి జి. రోహిణి, జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ‘ఇది రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. అయినప్పటికీ ఈ నిర్ణయంలో ఎటువంటి తప్పూలేదు. ఒక్కొక్కరికి ఒకటికి మించి ఫ్లాట్ ఉం డకూడదనేదే దీని ఉద్దేశం’ అని పేర్కొంది. పిటిషన్‌ను రవీంద్రసింగ్ అనే అడ్వొకేట్ దాఖలు చేశారు.
ఎట్టకేలకు డీడీఏ ఫ్లాట్ల డ్రా
Published Tue, Nov 25 2014 11:16 PM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM
Advertisement
Advertisement