హైకోర్టులో అగ్నిప్రమాదం
Published Tue, Jun 6 2017 5:55 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
చెన్నై: మద్రాసు హైకోర్టులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జనరేటర్ గదిలో మంగళవారం ఉదయం హఠాత్తుగా దట్టమైన పొగలు వ్యాపించడంతో పోలీసులు, ప్రజలు వెంటనే అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. వేసవి తీవ్రతతో తరచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల టి.నగర్ చెన్నై సిల్క్స్ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement