నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వదర ఉధృతి పెరుగుతోంది.
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వదర ఉధృతి పెరుగుతోంది. నిన్నటి నుంచి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్‌లోకి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 66,616 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో వెయ్యి క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ఆదివారం ఉదయానికి 536 అడుగుల వరకు నీరు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 180 టీఎంసీల నీరు నిల్వ ఉంది.