
ముంబై : మహా నగరం ముంబైలోని బెహ్రంపాద తదితర మురికివాడల్లో నివసిస్తున్న వారందరూ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన చొరబాటు దారులని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్‌ఎన్‌ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించారు. వీరందరికీ ఆధార్ కార్డులు సులువుగా దొరుకుతోందని అన్నారు.
ఇదే ట్రెండ్ గనుక కొనసాగితే పాకిస్తాన్‌తో కాకుండా చొరబాటు దారులతో భారత్ యుద్ధ చేయాల్సివుంటుందని హెచ్చరించారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి ముంబైలో జీవనం సాగిస్తున్న వారికి సంబంధించి ఎలాంటి అధికారిక రికార్డులు మెయింటైన్ చేయకపోవడంపై ఆగ్రహించారు. గత నెల 26న బాంద్రా రైల్వే స్టేషన్ పరిధిలో జరిగిన అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరగలేదని, ఎవరో కుట్ర పన్ని చేశారనే అనుమానం కలుగుతోందని అన్నారు.