టార్గెట్ ‘కార్యాలయాలు’ | GK Vasan's new party may be called Tamil Maanila Desiya | Sakshi
Sakshi News home page

టార్గెట్ ‘కార్యాలయాలు’

Published Fri, Nov 7 2014 3:37 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

టార్గెట్ ‘కార్యాలయాలు’ - Sakshi

టార్గెట్ ‘కార్యాలయాలు’

సాక్షి, చెన్నై : రాష్ర్టంలోని కాంగ్రెస్ కార్యాలయాలు తమ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు వాసన్ వర్గం సన్నద్ధం అవుతోంది. గురువారం కడలూరు జిల్లా పార్టీ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీయడంతో జిల్లా కలెక్టర్ రం గంలోకి దిగారు. టీఎన్‌సీసీ ప్రధాన కార్యదర్శి పదవికి కిళ్లియూర్ ఎమ్మెల్యే జాన్ జాకబ్ రాజీనామా చేశారు. తన పార్టీ, గుర్తు, కార్యాచరణ తెలియాలంటే వారం రోజులు వేచి ఉండాల్సిందేనని వాసన్ స్పష్టం చేశారు.రాష్ట్ర కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జీకే వాసన్ తన మద్దతు బలాన్ని పెంచుకునే పనిలో పడ్డా రు. గతంలో కాంగ్రెస్ నుంచి మూపనార్ బయటకు వచ్చిన సమయంలో ముఖ్య నేతలందరూ ఆయన వెంట నడిచారు. అయితే, ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉంది.
 
 ముఖ్య నేతలందరూ కాంగ్రెస్ వెంటే ఉన్నా, కింది స్థాయి కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో వాసన్ వెంట నడిచేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే వాసన్‌కు 30 జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, 9 మంది మాజీ ఎమ్మెల్యేలు, పలువురు మాజీ ఎంపీలు మద్దతు ప్రకటించారు. అలాగే, కాంగ్రెస్‌లో కొన్ని గ్రూపులకు చెందిన నాయకుల అనుచర గణాన్ని సైతం తమ వైపు తిప్పుకునేందుకు వాసన్ తీవ్ర ప్రయత్నాల్లో మునిగి ఉన్నారు. గ్రూపు నేతలతో విభేదాలున్న వారందర్నీ తమ వెంట తిప్పుకుని తిరుచ్చి వేదికగా బలాన్ని చాటేందుకు కుస్తీలుపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని జిల్లాల్లో వాసన్ మద్దతుదారులు జిల్లా పార్టీ కార్యాలయాలను టార్గెట్ చేయ టం చర్చకు దారి తీసింది.
 
 రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన ఆస్తులు, అనేక భవనాలు ట్రస్టు రూపంలో ఒకే చోటకు చేర్చారు. ఇందుకు ట్రస్టీగా గతంలో మూపనార్, తాజాగా వాసన్ వ్యవహరిస్తున్నారు. ఆయా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల భవనాలు మూపనార్ హయూంలో నిర్మించారు. కాంగ్రెస్ నిధితో కాకుండా విరాళాలు సేకరించి నిర్మించిన జిల్లా పార్టీ కార్యాలయాలు అనేకం ఉన్నట్టు సమాచారం. వాసన్ బలం అధికంగా ఉన్న జిల్లాల్లోను పార్టీ భవనా లు నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనాల్ని వాసన్ వర్గం టార్గెట్ చేసింది.
 
 వాటిని కాంగ్రెస్ గుప్పెట్లో నుంచి తమ ఆధీనంలోకి తెచ్చుకునే పనిలో పడ్డారు. అనేక మండల కార్యాలయాలు, నగర కార్యాలయాల భవనాలను తమ గుప్పెట్లోకి తెచ్చుని తమాకా జెండాల్ని ఎగుర వేయడం, ఆ కార్యాలయాలకు పేర్లను మార్చ డం వంటి చర్యల్లో మునిగారు. ఈ నేపథ్యంలో గురువారం కడలూరు జిల్లా పార్టీ కార్యాలయం కైవశం ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నా, వారిని తరిమి కొట్టి, తమ గుప్పెట్లోకి తెచ్చుకునే యత్నం చేశారు. ఆ భవనం రూపు రేఖల్ని తమాకా కార్యాలయంగా మార్చేశారు. అయితే, ఈ వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీయడంతో ఆ జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. తాత్కాలికంగా ఆ భవనానికి సీల్ వేయడం గమనార్హం.
 
 జాకబ్ రాజీనామా  
 కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవికి కిళ్లియూరు ఎమ్మె ల్యే జాన్ జాకబ్ రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం సోనియా గాంధీకి రాజీనామా లేఖ పంపించా రు. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో వాసన్ బలం అధికంగా ఉండడంతో, ఆ బలాన్ని మరింత రెట్టింపు చేయడం లక్ష్యంగా ఆ ప్రాంతానికి చెందిన నేతల్ని ఏకం చేసే పనిలో జాన్‌జాకబ్ నిమగ్నం అయ్యారు.  దక్షిణ తమిళనాడులోని అనేక అసెం బ్లీ సెగ్మెంట్లు కాంగ్రెస్‌కు పట్టుకొమ్మలుగా గతంలో ఉండడంతో, అక్కడ పాగా వేయడమే లక్ష్యంగా కొన్ని బృందాలు కార్యాచరణ చేపట్టారుు.
 
 వెయిట్ అండ్ సీ  
 ఆళ్వార్‌పేటలోని నివాసంలో వాసన్‌ను మీడియా కదలించింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తమ వాళ్లు కైవశం చేసుకోవడం లేదని, వారికి చెందిన భవనాలపై ఉన్న హక్కుపై నిలదీస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పార్టీ పేరు, జెండా, విధి విధానాలు, అన్నింటిపై కసరత్తులు జరుగుతున్నాయని, వారం రోజుల్లో తిరుచ్చి వేదికగా అన్నీ ప్రకటిస్తామన్నారు.  బిజీబిజీగా వున్న వాసన్ అప్పుడప్పుడు ఫోన్లలో మంతనాలలో మునిగి ఉండడం గమనించాల్సిందే.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement