వరదల్లో హనీమూన్ జంట | Honeymoon couple Trapped in flooding | Sakshi
Sakshi News home page

వరదల్లో హనీమూన్ జంట

Published Fri, Sep 12 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM

వరదల్లో హనీమూన్ జంట

వరదల్లో హనీమూన్ జంట

అన్నానగర్ :  తిరువేర్కాడులో గత నెల 27న వివాహం చేసుకున్న గౌరీ, రాజశేఖర్ కాశ్మీరు వరదల్లో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే, నగర రవాణా సంస్థ డ్రైవర్ ఎం.కరుణానిధి తన కుమార్తె అయిన గౌరీని రాజశేఖర్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. హనీమూన్ కోసం ఈ దంపతులు సెప్టెంబరు 2వ తేదీన కాశ్మీరుకు వెళ్లారు. వీరు సెప్టెంబరు 6వ తేదీన తిరిగి చెన్నై చేరుకోవాల్సి ఉండగా, నేటి వరకూ ఈ హనీమూన్ ప్యాకేజ్ టూర్‌ను బుక్ చేసిన సదరు ట్రావెల్ ఏజెంట్ వధూ-వరుల తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదు. కానీ బుధవారం గౌరీ తన తల్లిదండ్రులకు ఢిల్లీ నుంచి ఫోన్ చేసి తాము సురక్షితంగా ఉన్నామని తెలపడంతో పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం తమను చెన్నైకు పంపడానికి ఢిల్లీలోని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు గౌరీ ఫోన్‌లో తెలిపిందన్నారు. ఈ నెలాఖరుకి కొత్త పెళ్లి కొడుకైన రాజశేఖర్ కతార్‌లోని కొత్త ఉద్యోగంలో చేరవలిసి ఉందని కరుణానిధి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement