నగరంలో ఏర్పాటు చేసిన అక్రమ హోర్డింగ్‌లపై బాంబే హైకోర్టు గురువారం ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, ఆ పార్టీ ఎమ్మెల్యే బాలా నాంద్‌గావ్కర్, బీజేపీ ఎమ్మెల్యే ఆశీష్ శేలార్‌లకు
అక్రమ హోర్డింగ్‌లపై వివరణ ఇవ్వాలని ఆదేశం
సాక్షి, ముంబై: నగరంలో ఏర్పాటు చేసిన అక్రమ హోర్డింగ్‌లపై బాంబే హైకోర్టు గురువారం ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, ఆ పార్టీ ఎమ్మెల్యే బాలా నాంద్‌గావ్కర్, బీజేపీ ఎమ్మెల్యే ఆశీష్ శేలార్‌లకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. న్యాయస్థానాన్ని అవమానించినందుకు ఎందుకు విచారణ జరపకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గతంలో కోర్టులో జరిగిన విచారణలో అక్రమ హోర్డింగ్‌లు పెట్టబోమని అఫిడవిట్ సమర్పించిన వీరు తర్వాత ముంబైలో అనేక చోట్ల అక్రమ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. దీంతో కోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలైంది. దీనిపై ఆగ్రహానికి గురైన కోర్టు ఠాక్రే, నాంద్‌గావ్కర్, శేలార్‌లకు షోకాజ్ నోటీజు జారీ చేసింది.