జమిలి అసాధ్యమే! | Jamali Impossible in New Delhi Lok Sabha elections | Sakshi
Sakshi News home page

జమిలి అసాధ్యమే!

Published Wed, Feb 26 2014 11:41 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

Jamali Impossible in New Delhi Lok Sabha elections

లోక్‌సభ ఎన్నికలతోపాటు విధానసభ ఎన్నికలూ (జమిలి) నిర్వహించాలని ఆమ్‌ఆద్మీ పార్టీ వంటి పక్షాలు కోర్టులో పోరాడుతున్నా.. తీర్పు రావడానికి ముందే లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. 
 
 న్యూఢిల్లీ:అసెంబ్లీని రద్దు చేసి లోక్‌సభ ఎన్నికలతోపాటు విధానసభ ఎన్నికలూ నిర్వహించాలని ఆమ్‌ఆద్మీ పార్టీ వంటి పక్షాలు డిమాండ్ చేస్తున్నా, అందుకు దారులు మూసుకుపోయినట్టేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యేలోపు రాష్ట్రపతి పాలనపై కోర్టు నిర్ణయం వెలువడే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్-మేలో జరగవచ్చని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని, తక్షణం ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే కోర్టు ఈ కేసుపై నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆప్ కేసుపై మార్చి ఏడున విచారణ నిర్వహిస్తామని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల సంఘం కూడా మార్చిలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఆలోపు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం దాదాపు అసాధ్యం కాబట్టి ఆప్ పిటిషన్ వల్ల ఒరిగేదేమీ లేదని అంటున్నారు. 
 
 ఆప్ వాదన ఇది
 ‘ఢిల్లీలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం లేదు కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికలు నిర్వహించాలి. అవినీతి ఆరోపణలు ఉన్న కాంగ్రెస్ నాయకులు, మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను కాపాడుకునేందుకే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించింది. కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఫిర్యాదుతో నమోదైన అవినీతి కేసులపై విచారణ జరగడంతో కాంగ్రెస్ నిరాశకు గురై ఈ నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల్లోనూ ఆ పార్టీ భారీ పరాజయాన్ని చవిచూసింది. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సహా చాలా మంది మంత్రులు ఓడిపోయారు. కేంద్రంలో తామే అధికారంలో ఉన్నాం కాబట్టి ఢిల్లీ రాష్ట్రాన్నికూడా పరోక్షంగా పాలించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఫలితంగా కేసుల విచారణను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోంది. కాబట్టి రాష్ట్రపతి పాలన విధింపు ఏకపక్షమేగాక చట్టవిరుద్ధం. రాజ్యాంగంలోని 14 అధికరణానికి పూర్తి విరుద్ధం. ఇది ఢిల్లీవాసుల ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోంది. ఏ ఒక్క పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో లేనప్పుడు తాజాగా ఎన్నికలు నిర్వహించాలనిచట్టాలు చెబుతున్నాయి. అసెంబ్లీని అచేతనావస్థ లో ఉంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది’ అని ఆప్ న్యాయవాదు లు ప్రశాంత్ భూషణ్, నారిమన్ బెంచ్‌కు వివరిం చారు. ఈ కేసులో తాను రాజకీయ పక్షాలు జోలికి వెళ్లబోనని స్పష్టం చేసిన కోర్టు.. కాంగ్రెస్, బీజేపీకి నోటీసులు జారీ చేయడానికి తిరస్కరించింది. 
 
 నిబంధనలు ఏమంటున్నాయి...
 అసెంబ్లీని రద్దు చేసినట్టు సంబంధిత రాష్ట్ర గవర్నర్/లెఫ్టినెంట్ గవర్నర్ సమాచారం అందించిన ఆరు నెలల్లోపు ఈసీ అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ సర్కారు 49 రోజుల పాలన అనంతరం గత నెల 14న ప్రభుత్వం నుంచి వైదొలిగింది. అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా ఎల్జీకి సిఫార్సు చేసింది. అయితే ఆయన రాష్ట్రపతి పాల నకు సిఫార్సు చేయడం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆప్ అదే నెల 16న సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ సుముఖత వ్యక్తం చేయకున్నా అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచుతూ ఎల్జీ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఉన్నదీ లేనిదీ పరిశీలిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆర్‌ఎం లోధా, దీపక్ మిశ్రాతోకూడిన బెంచ్ ప్రకటించింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement