అవినీతిపైనే మా యుద్ధం | In Gurgaon manifesto, AAP vows to battle corruption | Sakshi
Sakshi News home page

అవినీతిపైనే మా యుద్ధం

Published Wed, Apr 2 2014 10:57 PM | Last Updated on Thu, Sep 27 2018 2:31 PM

In Gurgaon manifesto, AAP vows to battle corruption

న్యూఢిల్లీ: అవినీతి అంతమే తమ లక్ష్యమని, అందుకోసమే తమ పార్టీ పోరాడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. గుర్గావ్ మేనిఫెస్టోను బుధవారం విడుదల చేసిన ఆప్ నగరంలో పెచ్చరిల్లుతున్న అవినీతిని అంతం చేయడం కోసం తుదివరకూ పోరాడతామని ప్రకటించింది. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో... భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే నగరం గుర్గావ్ అని ఆ పార్టీ అభ్యర్థి యోగేంద్ర యాదవ్ అన్నారు. అపార్ట్‌మెంట్‌లలో నివసించే కుటుంబాల నుంచి మురికివాడల్లో నివసించే ప్రజల వరకు అందరినీ దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టో రూపొందించింది. 
 
 అయితే వీరంతా అవినీతి బాధితులేనని, అందుకే తమ మేనిఫెస్టోలో అవినీతి అంతమే తమ పార్టీ లక్ష్యంగా ప్రకటించామని యాదవ్ పేర్కొన్నారు.  ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తర ఫున రావ్ ధరమ్‌పాల్ యాదవ్, బీజేపీ నుంచి ఇంద్రజీత్‌సింగ్ పోటీ పడుతున్నారు. తనతో పోటీ పడుతున్న అభ్యర్థులెవరైనా గుర్గావ్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని యాదవ్ డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ తరఫున పోటీ చేస్తున్న ఆశిస్ కేతన్ కూడా సహచర కార్యకర్తలతో కలిసి బుధవారం నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement