24న జయ కేసు విచారణ
టీనగర్: సుప్రీంకోర్టులో జయలలిత కేసు ఈనెల 24వ తేదీన విచారణకు రానుంది. ఆస్తులు కూడబెట్టిన కేసులో ముఖ్యమంత్రి జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్ అనే నలుగురిని బెంగళూరు హైకోర్టు న్యాయమూర్తి కుమారసామి విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ క ర్ణాటక ప్రభుత్వం తరపున జూన్ 23వ తేదీ సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలైంది. అందులో పేర్కొన్న లోపాలను సరిదిద్దుతూ ఈ నెల 11వ తేదీ మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు. ఇదేవిధంగా డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ తరపున కూడా సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలైంది. ఇలావుండగా అప్పీలు పిటిషన్‌పై విచారణ ఈనెల 24వ తేదీ ప్రారంభం కానున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.