ఠాణే జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో 2010 నుంచి ఖాళీగా ఉన్న 829 టీచర్లు, హెడ్‌మాస్టర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బాంబే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ముంబై: ఠాణే జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో 2010 నుంచి ఖాళీగా ఉన్న 829 టీచర్లు, హెడ్‌మాస్టర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బాంబే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలలు టీచర్లు లేఖ నిరుపయోగంగా ఉన్నాయని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్తలు నితిన్ బోర్డే, రాందాస్ మోతెలు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షా ఈ ఆదేశాలను జారీ చేశారు.
గత సంవత్సరం మేలో రాష్ట్ర ప్రభుత్వం 700 మంది టీచర్లను గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలలకు బదిలీ చేసింది. అయితే వారిలో చాలా మంది సదరు బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సమ్మెకు కూడా దిగారు. చివరకు కోర్టు జోక్యంతో బదిలీ ఉత్తర్వులను ఆమోదించారు. అయినప్పటికీ రాష్ట్రంలో ఇంకా 829 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిలో 198 హెడ్‌మాస్టర్లవికాగా 182 మంది ప్రాథమిక పాఠశాలల్లోని ఉపాధ్యాయులవి. దీంతో వెంటనే వెయ్యి పోస్టులకు ఫిబ్రవరి 15 నాటికి నోటిఫికేషన్ విడుదల చేయాలని, జూన్ 30 నాటికి భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.