బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి నివాసం ముందు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రియాంకగాంధీపై నిందలు వేసిన స్వామి,
న్యూఢిల్లీ: బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి నివాసం ముందు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రియాంకగాంధీపై నిందలు వేసిన స్వామి, ఆమెకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తూర్పు ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత వర్యం కౌర్ నేతృత్వంలో మహిళా కార్యకర్తలు స్వామి నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు. బీజేపీ నేతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుబ్రమణియన్ స్వామి మహిళలను గౌరవించడం లేదని, ఆయన ప్రియాంకగాంధీకి క్షమాపణలు చెప్పకపోతే తమ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్నారు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ సవితా శర్మ. మథుర రోడ్డులో కూడా నిరసన చే పట్టాలని ప్రయత్నించడంతో ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఏప్రిల్ 15న కూడా ఆందోళన నిర్వహించిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్స్‌ను దాటి స్వామి ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్న విషయం తెలిసిందే.