శ్రీకాకుళం: ఎక్కడి నుంచి వచ్చాడో ఓ దుండగుడు అందరూ చూస్తుండగా రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కత్తితో అతి దారుణంగా పొడిచాడు. సినిమాను తలపించేలా జరిగిన ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో సోమవారం రాత్రి పాత బస్టాండ్ వద్ద చోటుచేసుకుంది. జనం మధ్యలోకి మాస్క్ వేసుకుని వచ్చి కత్తితో దాడి చేశాడు. దుండగుడి దాడిలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
సినిమాలో సన్నివేశాన్ని చూస్తున్న ప్రేక్షకుల్లా అక్కడి జనం నిలబడిపోయారు. బాధితుడు తీవ్రగాయాలతోనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయి మృతిచెందాడు. మృతుడిది శ్రీకాకుళం పట్టణంలోని ఓ స్వీట్ షాప్ ఓనర్‌గా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జనం మధ్యలో వ్యక్తి దారుణ హత్య
Published Mon, Aug 29 2016 10:13 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
Advertisement
Advertisement