నంగునూరు మండలం కొండరాజ్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది.
నంగునూరు మండలం కొండరాజ్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుల్ల శ్రీనివాస్(40) అనే వ్యక్తిని వ్యవసాయబావి వద్ద గేదెకు పాలు పితుకుతుండగా పాము కాటేసింది. దీంతో శ్రీనివాస్‌ను సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.