సాక్షి, చెన్నై: ప్రపంచ కార్మికుల హక్కుల దినోత్సవం మేడే. ఈ రోజు కార్మికులకు పం డుగ రోజు. ఆ దిశగా రాష్ట్రంలోని కార్మికు లు వాడవాడల్లో తమ పండుగను ఘనంగా జరుపుకున్నారు. కర్షక చిహ్నాలతో కూడిన జెండాల్ని ఎగుర వేశారు. స్వీట్లు, మిఠాయి లు పంచుకున్నారు. అన్నాడీఎంకే, డీఎంకే, డీఎండీకే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ తదితర పార్టీల అనుబంధ కార్మిక విభాగాల నేతృత్వంలోనూ వేడుకలు జరిగాయి.అన్నాడీఎం కే కార్మిక విభాగం నేతృత్వంలో బహిరంగ సభలు నిర్వహించి మేడేను జరుపుకున్నా రు. డీఎండీకే అనుబంధ కార్మిక విభాగం నేతృత్వంలో ఆ పార్టీ కార్యాలయాల్లో జెం డాలు ఎగురవేశారు. స్వీట్లు పంచి పెట్టారు.
స్మారక స్థూపం వద్ద వందనాలు
చింతాద్రి పేటలోని మేడే పార్కులో ఉన్న స్మారక స్థూపానికి వీర వందనం సమర్పించేందుకు పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు తరలివచ్చారు. పలువురు అక్కడి స్మారక స్థూపం వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి వీర వందనం సమర్పించారు. సీపీఎం, సీపీఐ నేతృత్వంలో ఆయా పార్టీ కార్యాలయాల వద్ద జెండాలను నాయకులు ఎగుర వేశారు. సీపీఎం కార్యాలయంలో మిఠాయిలు పంచి పెట్టారు. సీఐటీయూ నేతృత్వంలో రాష్ట్రంలో పలు చోట్ల మేడే ర్యాలీలు నిర్వహించారు.
వాడవాడలా మేడే
Published Thu, May 1 2014 11:58 PM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM
Advertisement