న్యూఢిల్లీ: జాతీయ రాజధానిలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈస్ట్రన్, వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్‌వేలపై చేపట్టిన ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల గడువును నిర్ణయించింది. ఢిల్లీకి చెందిన ఏడుగురు ఎంపీలు బుధవారం కేంద్ర హైవే, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. గడ్కరీని కలిసినవారిలో ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ), నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు తదితరులు ఉన్నారు. ఢిల్లీ-మీరట్ మధ్య ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని ఈ సందర్భంగా ఢిల్లీకి చెందిన ఎంపీల బృందం కేంద్రాన్ని కోరింది. ఆ తర్వాత దీనిని హరిద్వార్‌వరకూ పొడిగించాలని కూడా విన్నవించింది.
ఈవిధంగా చేయడం వల్ల ఈ మార్గంలో ట్రాఫిక్ జాం ఇబ్బందులు తప్పుతాయన్నారు. బీఆర్‌టీ ప్రాజెక్టుల భవితవ్యం విషయమై ప్రశ్నించగా ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కనపెట్టేశామన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల నగరవాసులు అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు. కాగా ఈశాన్య ఢిల్లీలో అదనంగా రెండు బ్యారేజీలను నిర్మించాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి నగరానికి పెద్దసంఖ్యలో వాహనాలు వస్తుండడంతో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన సమావేశంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ మీనాక్షిలేఖి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈస్ట్రన్, వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్‌వేలపై చేపట్టిన ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల గడువును నిర్ణయించిందన్నారు. ఆలోగా అవి పూర్తికావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
కాగా ఈ రెండు ఎక్స్‌ప్రెస్‌వేల పొడవు 135 కిలోమీటర్లు. వీటి నిర్మాణానికి 2006లోనే ప్రణాళికలను రూపొందించారు. అప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కదిలిన అధికారులు ఈ ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు జాతీయ రాజధానిలోకి ప్రవేశించకుండా చేసేందుకుగాను నగరం వెలుపల ఓ రింగ్ రోడ్డును నిర్మించాలని అత్యున్నత న్యాయస్థానానికి చెందిన ధ ర్మాసనం అప్పట్లో ఆదేశించింది.
ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం వల్ల ఘజియాబాద్, ఫరీదాబాద్, గౌతమ్‌బుద్ధనగర్, పల్వాల్ తదితర ప్రాంతాలు సంకేత రహితంగా మారిపోతాయి. ఇందువల్ల వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. అదేవిధంగా వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ వే... కుంది, పల్వాల్ ప్రాంతాలను అనుసంధానం చేస్తుంది. కాగా ఈ ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర ప్రభుత ్వం మూడు సంవత్సరాల గడువు ఇచ్చిన ప్పటికీ ఒకవేళ వాటిని కనుక రెండు లేదా రెండున్నర సంవత్సరాల వ్యవధిలో పూర్తిచేసినట్టయితే సదరు కాంట్రాక్టర్‌కు ఇన్సెంటివ్‌ను కూడా అందజేస్తుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు.
ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుల పూర్తికి మూడేళ్ల గడువు
Published Wed, Aug 20 2014 10:42 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement