మైలారం నల్లగుట్టలో ప్రకృతి వింత
3.5 కిలోమీటర్లు పొడవైన గుహలు
⇒ బొర్రా గుహలకు సరిజోడు
⇒ అడ్వంచర్ టూరిజానికి అడ్రస్
⇒ అభివృద్ధికి కసరత్తు
సాక్షి, భూపాలపల్లి: అమర్‌నాథ్ శివలింగాన్ని తలపించే విధంగా సున్నంతో వెలిసిన లింగం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగు చూ సింది. ఇటీవల తెలంగాణ సోషల్ మీడియా ఫోరం ఆధ్వర్యంలో గణపురం మండలం మైలారం సమీపంలో ఉన్న నల్లగుట్టలో ఉన్న సున్నపు గుహల్లో పరిశీలించిగా శివలింగాన్ని పోలిన ఆకారం బయటపడింది. అక్కడి వారికి ఈ గుహల గురించి ఎప్పటి నుంచో తెలిసిన స్థానికంగా ఉంటున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు సదానందం గతేడాది ఈ గుహల గురించి ప్రపంచానికి తెలియజేశారు. అప్పటి నుంచి ప్రజాప్రతినిధులు, పర్యాటకశాఖ అధికారులు సందర్శించారు.
ఇటీవల తెలంగాణ పర్యాటకశాఖ ప్రోత్సాహంతో నలభై మందితో కూడిన తెలంగాణ సోషల్ మీడియా ఫోరం సభ్యులు ఈ గుహల్లో అనువణువు గాలించగా పలు ఆసక్తికర అంశాలు తెలిశాయి. శివుడి లింగం, ఆవు పొదుగు, నగిషీలు, ఎగిరే పక్షులు, నేల మీద వాలిన డేగ, సింహం, మానవ ముఖం వంటి పలు ఆకృతుల్లో సహజ సిద్ధంగా ఏర్పడ సున్న పు శిలలు వెలుగు చూశాయి.
గుహల్లో అనేక దారులు
మైలారం నల్లగుట్ట నుంచి గుహల్లోకి వెళ్లడానికి అనేక దారులు ఉన్నాయి. నల్లగుట్టలకు పడమ టి వైపున ఉన్న మార్గం సహజసిద్ధమైన కోట మార్గంలా ఉంది. మిగిలిన వైపులా మానవ ని ర్మిత కట్టడాలు ఉన్నాయి. లోనికి మార్గాలు చిన్నగా ఉన్నప్పటికీ వెళ్లిన తర్వాత గుహలు చాలా పెద్దగా ఉన్నాయి. నల్లగుట్టల్లో ఉన్న సున్నపు గుహలు దాదాపు 3.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. గుహల ఎత్తు 5 నుంచి 100 అడుగులు ఉండగా వెడల్పు 10 నుంచి 100 అడుగులుగా ఉంది. కొన్ని గుహ లు విశాలమైన గదుల మాదిరిగా ఉన్నాయి. కొన్ని గుహల్లోకి గాలి, వెలుతురు దారళంగా వస్తుండగా కొన్ని గుహలు చిమ్మ చీకట్లో గబ్బిలాల ఆవాసాలుగా ఉన్నాయి. లోపల సగటు ఉష్ణోగ్రత 25 సెల్సియస్ డిగ్రీలుగా ఉంది. తేమ ఎక్కువగా లేదు. గుహల్లో కొన్ని చోట్ల పాకుతూ వెళ్లాలి.
ఆదిమానవుల ఆనవాళ్లు
గుహల్లో నీటి వనరుల ఆనవాళ్లు ఉండటాన్ని బట్టి ఇది ప్రాచీన కాలంలో ఆదిమానవుల ఆవాసమై ఉండవచ్చని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా బృందం జరిపిన పర్యటనలో సున్నపు గుహల్లో ఆదిమానవులు కాలం నాటి పలు ఉపకరణాలు, నాటి అవశేషాలు లభించాయి. వీటిలో రాతి గొడ్డళ్లు, రాతి సుత్తెలు, గీకుడు రాళ్లు, కుండ పెంకులు, మట్టి పాత్రలు ఉన్నాయి. కొన్ని రాళ్ల మీద చిత్రాలు కనిపించాయి. ఈ గుహల్లో కొన్ని ఎముకలు లభించాయి. వీటిని పరిశోధన నిమిత్తం సీసీఎంబీకి పంపారు. విస్తీర్ణంలో బొర్రా గుహల కంటే పెద్దగా ఉన్న మైలారం సున్నపు గుహలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సి ఉంది.
లింగాకృతి...
ఏడాది కిందట సున్నపు గుహలు వెలుగులోకి వచ్చినా వీటిని పూర్తిగా ఎవరూ చూడలేదు. ఇటీవల తెలంగాణ సోషల్ మీడియా సభ్యులు ఈ సాహసానికి ఒడిగట్టారు. మొత్తం నలభై మంది సభ్యుల బృందంలో నలుగురు సభ్యులు టార్చిలైటు వెలుతురులో గుహల్లో ఉన్న సన్నని మార్గాల గుండా పాకుతూ లోపలికి వెళ్లి పరిశీలించారు. ఇందులో ఓ గుహలో శివలింగం ఆకృతి వెలుగు చూసింది. ఈ లింగం అమర్‌నాథ్ లింగాన్ని పోలి ఉండటం విశేషం. మైలారం నల్లగుట్ట సున్న పు గుహల్లో ఆకట్టుకునే ఆకృతులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి. నల్లగుట్ట ఆర్కియన్ శిలలతో ఏర్పడింది. వర్షపు నీటిలో ఉండే సహజమైన ఆమ్లతత్వం కొండ రాళ్లలో ఉండే సున్నాన్ని కరిగించడం వల్ల సున్నపు రాళ్ల కొండలో గుహలుగా ఏర్పడ్డాయి. పై నుంచి కారిన సున్నపు అవక్షేపాలు గట్టి పడి గుహల గోడల పై వివిధ ఆకృతులుగా మారాయి. ఇవి నేలదాక చేరితే స్తంభాలుగా మా రిపోతాయి. నేల మీదకు చేరిన అవక్షేపాలు ముద్దగా మారి పలు ఆకృతులు సంతరించుకుంటాయని చెబుతున్నారు.