ఇళయదళపతితో మూడోసారి | Nayanthara to romance third time Ilayathalapathy in 'Vijay | Sakshi
Sakshi News home page

ఇళయదళపతితో మూడోసారి

Published Mon, Dec 8 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM

ఇళయదళపతితో మూడోసారి

ఇళయదళపతితో మూడోసారి

రీ ఎంట్రీతో హీరోయిన్‌గా రాణించడం అనేది కష్టసాధ్యం. అలాంటి దాన్ని సులభ సాధ్యం చేసింది నయనతార. ఇంతకుముందు కోలీవుడ్, టాలీవుడ్ అంటూ రౌండ్స్ కొట్టిన ఈ బ్యూటీ తాజాగా తమిళ చిత్ర పరిశ్రమ పైనే పూర్తిగా దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికీ తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు కదా మరింత పెరిగిందని చెప్పక తప్పదు. స్టార్ నటులు సూర్య నుంచి యువ నటులు విజయ్ సేతుపతివరకు నయనతారతో జత కట్టడానికి మక్కువ చూపుతుండడం నయనతార గర్వపడాల్సిన విషయమే. ప్రస్తుతం సూర్య సరసన మాస్, ఉదయనిధికి జంటగా నన్భేండా, విజయ్‌సేతుపతి సరసన నానుమ్ రౌడీదాన్ తదితర చిత్రాల్లో నటిస్తున్న మలయాళ బ్యూటీతాజాగా ఇళయదళపతితో రొమాన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
 
 ఈ అమ్మడు విజయ్‌తో శివకాశి చిత్రంలో సింగిల్ సాంగ్ లోను విల్లు చిత్రంలో సోలో హీరోయిన్‌గాను నటించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి జోడీ కట్టేందుకు సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ టాక్. విజయ్ ప్రస్తుతం శింబుదేవన్ దర్శకత్వంలో సోషియో మైథాలజికల్ చిత్రం చేస్తున్నారు. ఇందులో ఆయనతో శ్రుతిహాసన్, హన్సిక రొమాన్స్ చేస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఇది విజయ్ 58వ చిత్రం అవుతుంది. కాగా 59వ చిత్రానికి  కలైపులి ఎస్.థాను తన వి.క్రియేషన్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజారాణి, దర్శకుడిగా పరిచయమైన యువ దర్శకుడు అట్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో విజయ్ సరసన నయనతార నాయకిగా నటించనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement