పోలింగ్‌కు విస్తృతంగా ఏర్పాట్లు | polling Widely arrangements | Sakshi
Sakshi News home page

పోలింగ్‌కు విస్తృతంగా ఏర్పాట్లు

Published Thu, Apr 24 2014 12:43 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

polling Widely arrangements

తిరువళ్లూరు, న్యూస్‌లైన్: తిరువళ్లూరు పార్లమెంట్‌కు జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికారులు బుధవారం శరవేగంగా ఏర్పాట్లను పూర్తి చేశారు. తిరువళ్లూరు సెయింటానిస్ పాఠశాలలో భద్రపరిచిన ఈవీఎంల గదిని ఉదయం నాలుగున్నర గంటలకు తెరిచి అన్నింటిని పరిశీలించారు. ఉదయం నుంచే అధికారులు, పోలీసులు, కలెక్టర్ వీరరాఘవరావు, ఎస్పీ శరవణన్‌తోపాటు ఇతర అధికారులు పాఠశాలకు చేరుకుని ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మధ్యాహ్నానికే 24 జోన్‌లకు ఈవీఎంలను తరలించారు. దీంతో 4 గంటలకు అన్ని ఈవీఎంలను తరలించే పనులను భారీ పోలీసు బందోబస్తు మధ్య తరలిం చారు.
 
ఎస్పీ విలేకరులతో మాట్లాడు తూ, ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి పోలీసులు తమ వంతు కృషి చేస్తారని వారు వివరించారు. పోలీసులకు ప్రజలు, రాజకీయ పార్టీలు తమ సహకారాన్ని పోలీసులకు అందజేయాలని వారు కోరారు. ఎన్నికలను దృష్టిలో వుంచుకుని దాదాపు 4 వేల మంది పోలీసులు బందోబస్తు విధుల ను నిర్వహిస్తారని ఆయన వివరించా రు. అనంతరం కలెక్టర్ వీరరాఘవరావుకు ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడే అధికారులకు నిర్వహించనున్న శిక్షణ తరగతులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. పోలింగ్ వివరాలను గంటగంటకూ చేరవేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో అధికారులు ఉదాసీనతగా వ్యవహరించొద్దని ఆయన సూచించా రు. అనంతరం ఎన్నికల ఏర్పాట్లు, పోలీసుల బందోబస్తు సంబంధించిన విషయూలపై ఆరా తీశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement