‘ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రపతిని కలుస్తాం’
‘ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రపతిని కలుస్తాం’
Published Mon, Jan 2 2017 3:11 PM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM
కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం జోనల్ విధానాన్ని రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయంపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఈ చర్యపై రాష్ట్రపతిని కలువనున్నట్లు తెలిపారు. సోమవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఫ్రీజోన్ విధానాన్ని వ్యతిరేకించి కేసీఆర్ ఇప్పుడేమో అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవాలనుకోవటం తగదన్నారు. ఈ నిర్ణయంతో గ్రామీణప్రాంత విద్యార్థులు, ఉద్యోగార్థులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. అందుకే తామంతా కలిసి ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసి ఫ్రీజోన్ వద్దని కోరుతామన్నారు.
Advertisement
Advertisement