పెళ్లి రోజే ‘కళ్యాణలక్ష్మి’
కళ్యాణ లక్ష్మి నుంచి అందే సాయాన్ని పెళ్లి రోజే అందే విధంగా చూస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: రాష్ట్రంలోని పేద యువతుల పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తీసుకొచ్చిందని.. ఎవరో బలవంత పెడితేనో.. డిమాండ్ చేస్తేనో.. తేలేదని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇక మీదట కళ్యాణ లక్ష్మి నుంచి అందే సాయాన్ని వీలైతే పెళ్లి రోజే అందే విధంగా చూస్తామని మంత్రి తెలిపారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ప్రతిపక్ష సభ్యులు కళ్యాణలక్ష్మి పథకం అమలుపై అడిగిన ప్రశ్నలకు మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానమిస్తూ.. పేద యువతుల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేయడం కోసం సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకొచ్చారన్నారు. ఈ పథకాల కింద అందిస్తున్న రూ. 51 వేలను ఇక నుంచి పెళ్లి రోజే అందేవిధంగా చర్యలు తీసుకుంటమన్నారు.