హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపుచేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు మైనారిటీలకు షాదీముబారక్, గిరిజనులకు కల్యాణలక్ష్మీ పథకం పేరుతో ఉన్న ఇస్తున్న ఈ పథకాన్ని ఇక బీసీలకు ఇవ్వనున్నారు.
ఏడాది ఆదాయం రూ.2 లక్షలకు లోబడి ఉన్న వెనకబడిక కులాలకు చెందిన కుటుంబాలకు కల్యాణలక్ష్మీ పథకం వర్తింపు చేస్తారు. 18 సంవత్సరాలు నిండి వివాహం చేసుకోబోయే బీసీ యువతులకు ఈ పథకాన్ని అందిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వివాహం చేసుకునే వారికి ప్రభుత్వం పథకాన్ని వర్తింపు చేయనున్నారు. కల్యాణలక్ష్మీ పథకం కింద ప్రభుత్వం రూ.51 వేలను అందిస్తున్న విషయం తెలిసిందే.
ఇక బీసీలకు కల్యాణలక్ష్మి పథకం
Published Thu, Apr 21 2016 4:05 PM | Last Updated on Tue, Oct 30 2018 8:01 PM
Advertisement
Advertisement