టాలీవుడ్ హీరోలపై రాధిక ఆప్తే ఫైర్ | radhika apte fire on Tollywood heros | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ హీరోలపై రాధిక ఆప్తే ఫైర్

Published Wed, Jul 1 2015 3:00 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

టాలీవుడ్ హీరోలపై రాధిక ఆప్తే ఫైర్ - Sakshi

టాలీవుడ్ హీరోలపై రాధిక ఆప్తే ఫైర్

నటి రాధిక ఆప్తే గుర్తుందా? తమిళంలో ధోని, అళగురాజా చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ లెజెండ్, లయన్ తదితర చిత్రాల్లో కథానాయికిగా చేసింది.

నటి రాధిక ఆప్తే గుర్తుందా? తమిళంలో ధోని, అళగురాజా చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ లెజెండ్, లయన్ తదితర చిత్రాల్లో కథానాయికిగా చేసింది. ఈ భామ ఇప్పుడు టాలీవుడ్ కథానాయకులు, దర్శకనిర్మాతలపై విరుచుకు పడుతోంది. ఈ మధ్య తన అశ్లీల దృశ్యాలు వెబ్‌సైట్స్, వాట్సాప్‌లలో హల్‌చల్ చేయడంతో కంగుతిన్న రాధిక ఆప్తే ఆ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై ఎవరిపై ఏం అనుమానం ఉందో తెలియదు గానీ ఈ బదలాపూర్ అమ్మడు టాలీవుడ్ సినీ వర్గాలపై రుసరుసలాడుతోంది.

అక్కడి కొందరు దర్శక నిర్మాతలకు స్త్రీలపై గౌరవమే లేదంటూ దుమ్మెత్తి పోస్తోంది. కథానాయకుల ఆధిక్యం అధికం అంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. అందుకే టాలీవుడ్‌లో పలు అవకాశాలు వస్తున్నా నిరాకరిస్తున్నట్లు తెలిపింది. నిజం చెప్పాలంటే ఈ అమ్మడికి అక్కడంత సీన్ ఏమీలేదు. ఆమె ఫైర్ అవ్వడానికి అసలు కారణం వేరే ఏదో అయి ఉంటుందనే భావన వినిపిస్తోంది. కోలీవుడ్‌లోనూ అవకాశాలు లేని రాధిక ఆప్తే ప్రస్తుతం తన దృష్టిని బాలీవుడ్‌పై సారిస్తోంది.అన్నట్టు ఈ భామ ఇటీవల ఒక హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తోందన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement