మండుతున్న ఉల్లి ధరలు
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఉల్లిపాయల ధరలు మాత్రం తగ్గడం లేదు. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్ర లాసల్‌గావ్ మార్కెట్ వీటి ధరలు గత రెండు వారాల్లో 40 శాతం పెరిగి కిలో రూ.18.50కి చేరుకున్నాయి. దీంతో ఢిల్లీ టోకు, చిల్లర మార్కెట్లలో ఉల్లి ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ఈ పరిస్థితిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతుల సుం కాలను పెంచినా పరిస్థితితో మార్పు కని పించ డం లేదు. ఈసారి వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలు ఉండడంతో ధరలు పెరుగుతూనే ఉన్నాయని ఢిల్లీలో జాతీయ ఉద్యానవన పరిశోధన, అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఆర్డీఎఫ్) డెరైక్టర్‌ఆర్పీ గుప్తా అన్నారు.
లాసల్‌గావ్ మార్కె ట్లో ధరలు పెరుగుదల వల్ల ఆజాద్‌పూర్ మార్కె ట్లో ఉల్లి ధర కిలో రూ.25 వరకు పలుకుతోంది. లాసల్‌గావ్‌లో గత నెల 18న కిలో ఉల్లి ధర రూ.13.25 కాగా, ప్రస్తుతం ఇది రూ.18.50కి చేరింది. స్వదేశీ మార్కెట్లలో ఉల్లి ధరలు, ఎగుమతులను నియంత్రించడానికి గత నెల 17న కేంద్ర ప్రభుత్వం ఉల్లి కనిష్ట ఎగుమతి ధరను టన్నుకు 300 డాలర్లుగా నిర్ధారించింది. అయినప్పటికీ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. నిజానికి మే 30న ఉల్లి కిలో టోకు కేవలం రూ.9.75 మాత్రమేనని ఎన్‌హెచ్‌ఆర్డీఎఫ్ వర్గాలు తెలిపాయి.
ఉల్లి సరఫరాలో మార్పులేవీలేవని, కరువు సంభవించే అవకాశాలు ఉన్నందునే ధరలు పెరుగుతున్నాయని గుప్తా విశ్లేషించారు. రబీలో పండించిన 39 లక్షల టన్నుల ఉల్లిపాయలు దేశవ్యాప్తంగా గోదాముల్లో ప్రస్తుతం నిల్వ ఉన్నాయన్నారు. అయితే ఖరీఫ్ పంటలకు వర్షాలు లేకుంటే ఈ నిల్వలు సరిపోకపోవచ్చని చెప్పారు. ఈసారి సాధారణం కంటే తక్కువగానే వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ ప్రకటిం చింది. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదల సహజమేనని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ఉల్లిని పండించే భూముల్లో 40 శాతం వర్షాలపైనే ఆధారపడుతుండడం తో ఈ పరిస్థితి నెలకొంది. మనదేశంలో మహా రాష్ట్ర, కర్ణాటక,గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లిసాగు అధికంగా ఉంటుంది.