రష్యన్ పర్యాటకునిపై దాడి | Russian Tourist robbed by unknown persons in chennai | Sakshi
Sakshi News home page

రష్యన్ పర్యాటకునిపై దాడి

Published Sun, Jul 20 2014 9:17 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Russian Tourist robbed by unknown persons in chennai

వేలాంకన్నిలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు రష్యాకు చెందిన పర్యాటకునిపై దాడి చేసి నగదు,సెల్‌ఫోన్ దోచుకెళ్లారు. తీవ్రంగా గాయపడ్డ పర్యాటకున్ని వేలాంకన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రష్యాలోని సేబాక్సరి ప్రాంతానికి చెందిన నికిటిన్ సెర్జీ (34). ఇతను కోవై, మనాలి వంటి ప్రాంతాలను సందర్శించి చెన్నైకు వచ్చాడు. అక్కడి నుంచి వేలాంకన్నికి వెళ్లాడు.

 

అక్కడ ఇతను వేలాంకన్నిలో ఉన్న తెర్కు పొయ్‌కై నల్లూర్ అనే ప్రాంతంలో గుడారం ఏర్పాటు చేసుకుని ఉన్నాడు.  నలుగురి వ్యక్తులు నికిటిన్‌పై దాడిచేశారు. అతని వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్ దోచుకుని వెళ్లారు. దాడిలో గాయపడ్డ అతన్ని వేలాంకన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement