Russian Tourist
-
'ఆమె స్వదేశానికి వెళ్లిపోయింది'
న్యూఢిల్లీ: వారణాసిలో యాసిడ్ దాడికి గురైన రష్యా యువతి దార్య యురీవా(23) స్వదేశానికి వెళ్లిపోయింది. బాధితురాలు మాస్కోకు వెళ్లిపోయిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. రష్యాలో ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు భారత్ భరిస్తుందని బాధితురాలికి హామీయిచ్చినట్టు వెల్లడించారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 5 లక్షలు ప్రకటించిందని తెలిపారు. బాధితురాలిని తల్లిని రష్యాలోని తమ రాయబారి కలిశారని, అవసరమైన సాయం భారత ప్రభుత్వం అందిస్తుందని భరోసాయిచ్చారని చెప్పారు. బాధితురాలు త్వరగా కోలుకోవాలని సుష్మ ఆకాంక్షించారు. వారణాసిలో శుక్రవారం యురీవాపై యాసిడ్ దాడి జరిగింది. పెయింగ్ గెస్ట్ గా దిగిన ఇంటి యజమాని మనవడు ఈ అఘాయిత్యానికి పాల్పడాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో బాధితురాలికి 45 శాతం గాయాలయ్యాయి. ఆమెకు ప్లాస్టిక్ సర్జరీలు చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. -
రష్యన్ పర్యాటకునిపై దాడి
వేలాంకన్నిలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు రష్యాకు చెందిన పర్యాటకునిపై దాడి చేసి నగదు,సెల్ఫోన్ దోచుకెళ్లారు. తీవ్రంగా గాయపడ్డ పర్యాటకున్ని వేలాంకన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రష్యాలోని సేబాక్సరి ప్రాంతానికి చెందిన నికిటిన్ సెర్జీ (34). ఇతను కోవై, మనాలి వంటి ప్రాంతాలను సందర్శించి చెన్నైకు వచ్చాడు. అక్కడి నుంచి వేలాంకన్నికి వెళ్లాడు. అక్కడ ఇతను వేలాంకన్నిలో ఉన్న తెర్కు పొయ్కై నల్లూర్ అనే ప్రాంతంలో గుడారం ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. నలుగురి వ్యక్తులు నికిటిన్పై దాడిచేశారు. అతని వద్ద ఉన్న నగదు, సెల్ఫోన్ దోచుకుని వెళ్లారు. దాడిలో గాయపడ్డ అతన్ని వేలాంకన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.