సింగం-3కి శ్రుతి రెడీ
పులితో రొమాన్స్ చేసిన శ్రుతిహాసన్ ఇప్పుడు సింహంతో సయ్యాటకు సిధ్ధం అవుతున్నారు. ఏమిటి అర్థం కాలేదా? అయితే కాస్త వివరంగా చెప్పాల్సిందే. ఇప్పుడు భారతీయ సినిమాలో స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న నటి శ్రుథిహాసన్. ఇంకా చెప్పాలంటే దక్షిణాదిలో ఈ బ్యూటీ హవానే నడుస్తోంది. ఆ మధ్య తమిళంలో పూజై చిత్రంతో విజయాన్ని అందుకున్న శ్రుతిహాసన్ ఇటీవల తెలుగులో శ్రీమంతుడు చిత్రంతో భారీ హిట్ కొట్టేశారు. ఇక తమిళంలో మూడు చిత్రాలు, హిందీలో మూడు, తెలుగులో ఒక చిత్రం అంటూ యమ బిజీగా ఉన్నారు.
కాగా తమిళంలో విజయ్‌తో పులి చిత్రాన్ని పూర్తి చేసిన శ్రుతి ప్రస్తుతం అజిత్‌కు జంట గా ఇంకా పేరు పెట్టని ఆయన 56వ చిత్రంలో నటిస్తున్నారు.తాజాగా సూర్య సరసన సింగం-3లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇంతకు ముందు సూర్యతో 7ఆమ్ అరివు చిత్రంలో జత కట్టిన శ్రుతిహాసన్ రెండవ సారి ఆయనతో నటించడానికి రెడీ అవుతున్నారన్న మాట. సింగం, సింగం-2 చిత్రాలకు సృష్టి కర్త అయిన హరినే సింగం-3 కి దర్శకత్వం వహించనున్నారు. ఈయన దర్శకత్వంలో శ్రుతి ఇంతకు ముందు పూజై చిత్రంలో నటించారు. సింగం-3 వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న రెండవ చిత్రం అన్నది గమనార్హం. ఈ క్రేజీ చిత్రం ఈ నెల రెండవ వారంలో సెట్ పైకి వెళ్లనుందన్నది కోటీవుడ్ తాజా సమాచారం.