
మళ్లీ హీరోగా..
ప్రముఖ దర్శక, నటుడు సుందర్ సి మరోసారి కథానాయకుడిగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నారు. ఈయన ఇంతకుముందు నగరం మరు పక్కం,
ప్రముఖ దర్శక, నటుడు సుందర్ సి మరోసారి కథానాయకుడిగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నారు. ఈయన ఇంతకుముందు నగరం మరు పక్కం, ఐందాంపడై తదితర చిత్రాలలో హీరోగా నటించారు. వాటిలో కొన్ని చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోవడంతో దర్శకత్వంపై దృష్టి సారించారు. కలగలప్పు, తీయవిల్లై సెయ్యనుం కుమార, అరణ్మణై వంటి చిత్ర విజయాలతో దర్శకుడిగా పూర్వ వైభవం పొందారు. అయితే అరణ్మణై చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన సుందర్ సి ఇప్పుడు ఆ చిత్ర విజయంతో మరోసారి హీరోగా నటించడానికి సిద్ధమవుతున్నారు. మలయాళంలో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన వెల్లిముంగా చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తూ హీరోగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని తన భార్య నటి కుష్భు అల్కి పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.