సీఎం కేసీఆర్ నియం తృత్వ, అప్రజాస్వామిక పాలనను ప్రజల్లో ఎండగట్టడానికి సామాజిక శక్తులన్నీ ఏకం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
మానకొండూర్: సీఎం కేసీఆర్ నియం తృత్వ, అప్రజాస్వామిక పాలనను ప్రజల్లో ఎండగట్టడానికి సామాజిక శక్తులన్నీ ఏకం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర శుక్రవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజక వర్గంలో కొనసాగింది. అల్గునూరు, మానకొండూర్, అన్నారం, దేవంపల్లి, కొండపల్కలల్లో ఆయన మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి కేసీఆర్ చట్టవిరుద్ధంగా పాలన కొనసా గిస్తున్నారని ఆరోపించారు. పాదయాత్రలో కాంగ్రెస్ ఎస్సీసెల్ రాష్ట్ర చైర్మన్ ఆరెపల్లి మోహన్ పాల్గొని మద్దతు తెలిపారు.
కనీస సదుపాయాలు కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ అర్హతకు కావాల్సిన అర్హతల విషయాన్ని ప్రభుత్వం విస్మరించిందని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కరీంనగర్‌కు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.